Home » Sr.ఎన్టీఆర్ ఫుడ్ మెనూ !

Sr.ఎన్టీఆర్ ఫుడ్ మెనూ !

by Anji
Published: Last Updated on
Ad

 ఎన్టీఆర్ ఫుడ్ మెనూ చూస్తే షాక్ అవ్వాల్సిందే..! ఆయ‌న త‌న‌దైన ముద్ర వేసుకున్నారు. ఇండ‌స్ట్రీలోనే క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన నటుడు ఎవ‌రైనా ఉన్నారా అంటే ఎన్టీఆర్ అని ఎవ‌రైనా ట‌క్కునా స‌మాధానం చెబుతుంటారు. కృష్ణుడు, రాముడు, రావ‌ణాసురుడు ఏ పాత్ర చేసినా అద్భుతంగా ఆక‌ట్టుకునేవారు. సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కొత్త‌లో వ‌చ్చిన ప్ర‌తి చిన్న అవ‌కావాన్ని స‌ద్వినియోగం చేసుకుని వెండితెర దేవుడిగా కొలిచే స్థాయికి ఎదిగారు.

Advertisement

ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలో ఉద‌యం ఏడు గంట‌ల నుంచి మ‌ద్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కూ ఆ త‌ర‌వాత మ‌ద్యాహ్నం రెండు గంట‌ల నుంచి రాత్రి తొమ్మిది గంట‌ల వ‌ర‌కూ షూటింగ్ లో పాల్గొనే వార‌ట‌.ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న ఆహార‌శైలి మాత్రం ప్ర‌త్యేకంగా ఉండేది. ఎన్టీఆర్ తీసుకునే ఆహారం విష‌యంపై ఇప్ప‌టికీ చాలా మందికి ఆశ్చ‌ర్యం క‌లుగుతూనే ఉంటుంది. ఎన్టీఆర్ ఉద‌యం 3 గంట‌ల‌కే నిద్ర‌లేచేవార‌ట‌. వ్యాయామం చేసిన త‌రువాత అర‌చేతి మందంలో ఉండే 24 ఇడ్లీల‌ను తినేవారు. ఇలా కొంత కాలం పాటు ఇడ్లీలు తిని ఆ త‌రువాత మానేసి డైలీ భోజ‌నం చేసేవార‌ట‌. ఎన్టీఆర్ భోజ‌నంఓల నాటుకోడి కూడా క‌చ్చితంగా ఉండేవిధంగా చూసుకునే వారు. చెన్నైలో ఎప్పుడైనా బ‌జ్జీలు తినాల‌నుకున్న‌ప్పుడు 30 లేదా 40 బ‌జ్జీల‌ను సునాయ‌సంగా తినేవార‌ట‌.

Advertisement

ఎండా కాలం వ‌చ్చిందంటే ఆహార అల‌వాట్ల‌ను మార్చేవార‌ట‌. రెండు లీట‌ర్ల బాదంపాలు తాగేవారు. భోజ‌నం చేసిన త‌రువాత ఆపిల్ జ్యూస్‌లో గ్లూకోజ్ వేసుకొని తాగేవార‌ట‌. ఎన్టీఆర్ కొత్త ప్రాంతానికి వెళ్లిన‌ప్పుడు అక్క‌డ ఉండే రుచుల‌ను కూడా టేస్ట్ చేసేవార‌ట‌. ప్ర‌ధానంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక చైత‌న్య యాత్ర‌లో ఆయ‌న ప్ర‌జ‌ల‌తో మ‌మేకమై ఎక్క‌డ స‌మ‌యం దొరికితే అక్క‌డ ఏది ఉంటే అది తినేవార‌ట‌. సౌక‌ర్యాలు లేని స‌మ‌యంలో సాధార‌ణ జీవితం గ‌డిపార‌ట ఎన్టీఆర్.

Also Read :  ఒకప్పటి స్టార్ విలన్ ఇప్పుడు అలాంటి స్థితిలో ఉన్నాడా..? చివరికి డబ్బుల్లేక..!

Visitors Are Also Reading