Home » కృష్ణవంశీ మాట లెక్క‌చేయ‌కుండా ప్రభాస్ నటించిన డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా…?

కృష్ణవంశీ మాట లెక్క‌చేయ‌కుండా ప్రభాస్ నటించిన డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా…?

by AJAY
Ad

టాలీవుడ్ లోని టాలెంటెడ్ డైరెక్టర్ ల‌లో కృష్ణ‌వంశీ ఒక‌రు. ఒకప్పుడు విభిన్న చిత్రాలతో కృష్ణ‌వంశీ ప్రేక్షకులను మెప్పించాడు. ఫ్యామిలీ డ్రామా… సోషల్ మెసేజ్ ఇలా ఏ సినిమా అయినా కృష్ణవంశీ తన మార్క్ ను చూపిస్తారు. ఆయన దర్శకత్వంలో నిన్నే పెళ్లాడతా, సింధూరం, గులాబీ, సముద్రం, మురారి లాంటి సినిమాలు వచ్చాయి. రీసెంట్ గా కృష్ణవంశీ రంగమార్తాండ అనే ఫ్యామిలీ డ్రామా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Advertisement

ఈ సినిమా సైతం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే వసూళ్ల‌ పరంగా చూస్తే రంగమార్తాండ నిరాశపరిచిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే రంగమార్తాండ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కృష్ణవంశీ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రభాస్ నటించిన ఓ డిజాస్టర్ సినిమా రిజల్ట్ ను తాను ముందే ఊహించాన‌ని చెప్పారు.

Advertisement

ప్రభాస్ కృష్ణవంశీ కాంబినేషన్ లో చక్రం సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. అయితే ఈ సినిమాకు ముందే ప్రభాస్ తో తాను యాక్షన్ సినిమా చేయాలని అనుకున్నట్లు తెలిపారు. కానీ ప్రభాస్ తాను డిఫరెంట్ సినిమా చేయాలని అనుకుంటున్నాని తనతో చెప్పాడని అన్నారు. యాక్షన్ సినిమా వద్దన్నాడని తెలిపారు.

కల్హోనా హో తరహా సినిమా చేద్దామని ప్రభాస్ చెబితే తాను వద్దన్నానని అన్నారు. ఆ సినిమా నీకు సెట్ అవ్వదు అని చెప్పినా ప్రభాస్ వినలేదని… నాకు అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని ఉంది అన్నాడ‌ని తెలిపారు. ఇక‌ చక్రం సినిమా కథ చెప్పగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అన్నారు. ప్రభాస్ అభిమానులకు చ‌క్రం సినిమా నచ్చదేమో అని కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా యాడ్ చేశామని అన్నారు. కానీ ఆ సినిమా ఊహించినట్టుగానే ఫ్లాప్ అయ్యిందని చెప్పాడు.

ALSO READ : “హ్యాపిడేస్” టైసన్ గుర్తున్నాడా..? ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో చూస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Visitors Are Also Reading