Home » “హ్యాపిడేస్” టైసన్ గుర్తున్నాడా..? ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో చూస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

“హ్యాపిడేస్” టైసన్ గుర్తున్నాడా..? ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో చూస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో కొన్ని సినిమాలు ఎవ‌ర్ గ్రీన్ గా నిలుస్తాయి. అలాంటి సినిమాల‌లో హ్యాపిడేస్ సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమాకు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇంజ‌నీరింగ్ కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెర‌కెక్కింది. కాలేజీలో ఓ బ్యాచ్ ఎలా ఉంటుంది. స్టూడెంట్ ల మ‌ధ్య ల‌వ్ ఎలా ఉంటుంది..స్నేహం ఎలా ఉంటుంది…సూడెంట్స్ మ‌ధ్య గొడ‌వ‌లు ఎలా జ‌రుగుతాయి ఇలా ప్ర‌తిదీ డైరెక్ట‌ర్ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించాడు.

Advertisement

ఇక ఈ సినిమా కాటేజీ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్క‌డంతో ఒ బ్యాచ్ కోసం కొంత‌మంది న‌టీన‌టులు ముఖ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాలో న‌టించిన చాలా మందికి ఇండ‌స్ట్రీలో లైఫ్ వ‌చ్చింది. ఇక‌ సినిమాలో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న పాత్ర‌ల‌లో టైసన్ పాత్ర కూడా ఒక‌టి. ఈ పాత్ర‌లో రాహుల్ అనే కుర్రాడు న‌టించాడు. సినిమాలో ప్ర‌యోగాలు చేస్తూ టైస‌న్ అంద‌ర్నీ త‌న వైపు ఆక‌ర్షిస్తుంటాడు.

Advertisement

అంతే కాకుండా క్లాస్ మేట్స్ తో కాకుండా త‌న సీనియ‌ర్ తో టైస‌న్ ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఇక ఈ సినిమాతో గుర్తింపు రావ‌డంతో టైస‌న్ ఆ త‌ర‌వాత వ‌రుస ఆఫ‌ర్ లు అందుకుంటార‌ని అంతా అనుకున్నారు. కానీ రాహుల్ త‌ర‌వాత చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఈ సినిమా 2007లో ప్రేక్ష‌కుల ముందుకు రాగా ఆ త‌ర‌వా రెయిన్ బో అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా బోల్తో కొట్టింది.

అంతే కాకుండా ఆ త‌ర‌వాత ముగ్గురు, ప్రేమే ఒక మైకం, మ్యూజిక్ మేజిక్, ల‌య్ యూ బంగారం, వెంక‌టాపురం అనే సినిమాల‌లో న‌టించాడు. వీటిలో ఒక్క‌టంటే ఒక్క సినిమా కూడా రాహుల్ కు పేరు తెచ్చిపెట్ట‌లేదు. 2017లో రాహుల్ చిర‌వ‌గా వెంక‌టాపురంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఇక ఆ త‌ర‌వాత ఇండ‌స్ట్రీకి దూరమయ్యాడు. ఇక రాహుల్ కు 2015లోనే వివాహం అవ్వ‌గా ఒక కూతురు జ‌న్మించింది. సినిమాల‌కు దూర‌మైనా రాహుల్ ఫిట్నెస్ ను మెయింటైన్ చేస్తున్నాడు. అంతే కాకుండా ఎప్ప‌టికైనా బ్రేక్ రాక‌పోతుందా అని ఎదురుచూస్తున్నాడు. రాహుల్ జీవితంలో ఏదైనా మ్యాజిక్ జ‌రుగుతుందా లేదా చూడాలి మ‌రి.

ALSO READ :చరణ్ – ఉపాసనలకు పుట్టబోయేది అమ్మాయే… ఇదిగో ప్రూఫ్…?

Visitors Are Also Reading