టాలీవుడ్ సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమకు దిగ్గజంగా, గొప్ప నటుడిగా విలక్షణమైన పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన కృష్ణంరాజు నిర్మాతగా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. సెప్టెంబర్ 11న అనారోగ్యం కారణంతో మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈయన మరణవార్త తెలుగు సినీ పరిశ్రమకు మాత్రమే కాదు. దేశ రాజకీయ వ్యవస్థకు కూడా తీవ్రమైన నిరాశను మిగిల్చింది.
Advertisement
also read:నా బ్యాచ్ హీరోలందరూ దొంగలే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన నటి విజయశాంతి..!!
ఇకపోతే ఆయన మరణించిన రోజు నుంచి ఇప్పటివరకు కృష్ణంరాజు, ఆయన ఫ్యామిలీ, ప్రభాస్ కి సంబంధించి రోజు ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉందని చెప్పాలి. ఇక కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కొనసాగుతున్నాడు. కేవలం ప్రభాస్ మాత్రమే ఆయన సినీ వారసుడు కాదు.. ఆయన పెద్ద కూతురు ప్రసీదా కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నిర్మాతగా రాణిస్తోంది. నిర్మాతగా మారి తన అన్న నటించిన సినిమా రాధేశ్యామ్‌కి నిర్మాతగా వ్యవహరించింది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో విడుదలైన విషయం తెలిసిందే.
Advertisement
దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. భారీ తారాగణం,భారీ బడ్జెట్ తో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా హై టెక్నికల్ వాల్యూస్‌తో సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ భారీ డిజాస్టర్‌ను చవిచూసింది. నిర్మాతగా మొదటి సినిమా సూపర్ హిట్ అవ్వాలని ప్రసిదా ఎన్నో ప్రయత్నాలు చేసిది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. రూ.350 కోట్ల పెట్టుబడి పెడితో రూ.100 కోట్ల వరకు నష్టం మిగిల్చింది. ఇక ఇప్పటికైనా కాస్త చూసి ఆలోచించి అడుగు వేయాలని.. మంచి కంటెంట్ ఉన్న కథలను మాత్రమే ఎంచుకోవాలని అభిమానులు కోరుతున్నారు.