Home » గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోయిన కోవై స‌ర‌ళ‌….నెట్టింట వైర‌ల్ అవుతున్న ఫోటో..!

గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోయిన కోవై స‌ర‌ళ‌….నెట్టింట వైర‌ల్ అవుతున్న ఫోటో..!

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో లేడీ క‌మెడియ‌న్స్ చాలా త‌క్కువ మంది ఉంటారు. ఇక ఒక‌ప్పుడు అయితే లేడీ క‌మెడియ‌న్ లు అతిత‌క్కువ మంది మాత్ర‌మే ఉంటారు. కానీ కోవై స‌ర‌ళ ఒకప్పుడు లేడీ క‌మెడియ‌న్ గా ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. కోవై స‌ర‌ళ బ్ర‌హ్మానందంకు భార్య‌గా ఎక్కువ‌గా సినిమాలు చేశారు. బ్రహ్మానందంతో క‌లిసి కామెడినీ పండించి ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఒక‌ప్పుడు స్టార్ హీరోల సినిమాలలో కోవై స‌ర‌ళ క‌చ్చితంగా క‌నిపించేవారు.

Advertisement

అయితే చాలా కాలం నుండి కోవై స‌ర‌ళ అస‌లు టాలీవుడ్ లో క‌నిపించ‌డం లేదు. చాలా సినిమాలు విడుద‌ల‌వుతున్న‌ప్ప‌టికీ ఒక్క సినిమాలోనూ కోవై స‌ర‌ళ‌కు అవ‌కాశం ద‌గ్గ‌కం లేదు. ఇదిలా ఉంటే ఒక‌ప్పుడు తెలుగులో న‌టించిన కోవై స‌ర‌ళ ఇప్పుడు తెలుగులో క‌నిపించ‌డం లేదు కానీ కోలీవుడ్ లో మాత్రం సినిమాలు చేస్తున్నారు. తాజాగా కోవై స‌ర‌ళ త‌మిళంలో సెంబి అనే సినిమాలో న‌టిస్తున్నారు.

Advertisement

ఇటీవ‌ల సినిమా టీజ‌ర్ విడుద‌ల కాగా కోవై స‌ర‌ళ గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోయారు. ఆమెను చూసి నెటిజ‌న్ లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో కోవై స‌ర‌ళ బామ్మ పాత్రలో న‌టించారు. బామ్మ పాత్ర కావ‌డంతో కోవై స‌ర‌ళ డీ గ్లామ‌ర్ గా క‌నిపిస్తున్నారు.

అంతే కాకుండా ఆమెను గుర్తుప‌ట్ట‌డం కూడా చాలా క‌ష్టంగా మారిపోయింది. ఇదిలా ఉంటే అప్ప‌ట్లో ఓ మీడియా ప్ర‌తినిధి మీరు తెలుగు సినిమాల‌లో ఎందుకు న‌టించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. దాంతో కోవై స‌ర‌ళ త‌న‌కు తెలుగులో ఆఫ‌ర్ లు రావ‌డం లేదని వ‌స్తే క‌చ్చితంగ నటిస్తాన‌ని అన్నారు.

Visitors Are Also Reading