మంత్రి కొండా సురేఖ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభకి ప్రభుత్వ నిధులు ఉపయోగించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ ప్రజాధనం దుర్వినియోగం గురించి మాట్లాడే అర్హత కవితకు లేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్లుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని తెలంగాణని అప్పులపాలు చేశారని ఫైర్ అయ్యారు.
Advertisement
Advertisement
పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడనుండి అయినా పోటీ చేస్తానని కవిత అన్న వాటిని గుర్తు చేస్తూ సురేఖ రియాక్ట్ అయ్యారు లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కవిత ఎక్కడి నుండి ఎంపిక పోటీ చేసిన ప్రజలు పడగొట్టి ఇంటికి పంపుతారని అన్నారు. అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కవిత కోరడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే గత పది ఏళ్లుగా అధికారంలో ఉందని ఆ పదేళ్లలో కవితకి పూలే గుర్తుకు రాలేదా అని అడిగారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నేతలు భూములు కబ్జాపై పెట్టిన శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టలేదని అన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!