Home » Kona venkat: “రాజకీయాలు మీకు సెట్ కావు” పవన్ కి కోన వెంకట్ సలహా … పవన్ ఇచ్చిన రిప్లై అదుర్స్

Kona venkat: “రాజకీయాలు మీకు సెట్ కావు” పవన్ కి కోన వెంకట్ సలహా … పవన్ ఇచ్చిన రిప్లై అదుర్స్

by Sravya
Ad

Kona venkat:  ప్రముఖ రచయిత డైరెక్టర్ అలానే ప్రొడ్యూసర్ అయినటువంటి కోన వెంకట్ తాజాగా పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. పవన్ కళ్యాణ్ కి తాను సలహా ఇచ్చానని మడిచి నీ దగ్గర పెట్టుకో అని అన్నారని షాక్ ఇచ్చారు. మరి కోన వెంకట్ ఇచ్చిన సలహా ఏంటి..? అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ అలా రియాక్ట్ అయ్యారు అనేది తెలుసుకుందాం. గీతాంజలి మళ్లీ వచ్చింది రిలీజ్ కి రెడీ అవుతోంది. అంజలి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 11న రిలీజ్ అవుతుంది.

pawankalyan-konavenkat

Advertisement

 

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో కోన వెంకట్ పవన్ కళ్యాణ్ తనతో ప్రవర్తించిన తీరు గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం మనకు తెలుసు. రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ బిజెపితో కలిసి పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు అయితే కూటమితో కలిసి ఎలా అయినా ఎన్నికల్లో గెలవాలని ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో ఒక వర్గం నుండి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ వస్తుంటే ఇంకో వర్గం నుండి మాత్రం విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Also read:

Also read:

తాజాగా పవన్ కళ్యాణ్ తో జరిగిన ఒక షాకింగ్ సంభాషణ గురించి చెప్పారు పవన్ కళ్యాణ్ కి సలహా ఇచ్చానని రాజకీయాలు నీకెందుకు అసలే నువ్వు ఇంట్రావర్ట్ పైగా సెన్సిటివ్ గా ఉంటావు అని పవన్ కళ్యాణ్ తో తాను అన్నానని అన్నారు. ఎవడు పడితే వాడు మాట్లాడుతున్నాడు ఇది నీకు అవసరమా అని అడిగానని, పవన్ కళ్యాణ్ నీ ఒపీనియన్ ని మడిచి నీ దగ్గరే పెట్టుకో అన్నారని చెప్పి కోన వెంకట్ చెప్పారు. 2019లో కూడా పవన్ పాలిటిక్స్ పై ఆయన చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading