Home » కోహ్లీ సెంచరీ చేసిన ప్రయోజనం లేదంట..!

కోహ్లీ సెంచరీ చేసిన ప్రయోజనం లేదంట..!

by Azhar
Ad

టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు ఫామ్ కోల్పోవడం పెద్ద చర్చకు ధరి తీసిన విషయం తెలిసిందే. మ్యాచ్ ఏదైనా ఏ దేశానికి సంబంధించిన మాజీ, ప్రస్తుత ఆటగాడు అయిన సరే అతనికి కోహ్లీ గురించి ప్రశ్నలు అనేది ఎదురవుతున్నాయి. కోహ్లీ మళ్ళీ ఫామ్ లోకి రావాలనుంటే ఏం చేయాలనీ మీరు అనుకుంటున్నారు అని వారిని ప్రశ్నిస్తున్నారు. అయితే అందులో చాలా మంది ఆటగాళ్లు కోహ్లీకి సపోర్ట్ గా ఉంటె… ఇంకొందరు కోహ్లీ పని అయ్యిపోయిందని.. అతడిని జట్టు నుండి తప్పించాలని అంటున్నారు.

Advertisement

ఈ క్రమంలో ఈ ఏడాది ఐపీఎల్ లో కోహ్లీ పూర్తిగా విఫలం కావడంతో.. అతనికి కొన్ని రోజులు రెస్ట్ ఇచ్చి ఇంగ్లాండ్ పర్యటనకు పంపారు. కానీ అక్కడ కూడా కోహ్లీ ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఈ క్రమంలోనే మళ్ళీ ఇప్పుడు టీం ఇండియా ఉన్న వెస్టిండీస్ పర్యటన నుండి విరాట్ విశ్రాంతి తీసుకున్నాడు. అయితే ఈ విషయంలో కూడా అతని పై చాలా విమర్శలు వచ్చాయి. ఇక ఇదే సమయంలో ఈ విండీస్ పర్యటన అనేది పూర్తయిన తర్వాత భారత జట్టు వెళ్లనున్న జింబాంబ్వే పర్యటనకు విరాట్ కోహ్లీ కూడా వెళ్లనున్నాడు అని తెలుస్తుంది. కానీ ఈ పర్యటనలో కోహ్లీ సెంచరీ చేసినా కూడా అది ఎందుకు పనికిరాదు అని న్యూజిలాండ్ మాజీ ఆటగాడు స్కాట్ స్టైరిస్ అన్నారు.

Advertisement

తాజాగా స్కాట్ స్టైరిస్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ.. ఈ జింబాంబ్వే టూర్ కు విరాట్ కోహ్లీ వెళ్లిన కూడా అది వెస్ట్. ఇక్కడ అతను సెంచరీ చేసినా కూడా మళ్ళీ విరాట్ ఫామ్ లోకి వస్తాడు అని నేను అనుకోను. అనవసరంగా ఈ పర్యటనకు వెళ్లడం కంటే కొన్ని ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే మంచింది. అలాగే జట్టు యాజమాన్యం కూడా అతడిని ప్రపంచ కప్ కోసం సిద్ధం చేయాలనీ పేర్కొన్నాడు. అలాగే ఇప్పుడు కోహ్లీ ఫామ్ లో లేకపోయినా కూడా అతను ఓ ప్రమాదకరమైన ఆటగాడు అని స్కాట్ స్టైరిస్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి :

ఇక ఏడాదికి రెండు ఐపీఎల్స్.. ఎలా అంటే..?

బీసీసీఐ మాదిరే అన్ని బోర్డులకు లాభాలు రావాలి..!

Visitors Are Also Reading