Home » పవన్ కళ్యాణ్ మూవీకి కొడాలి నాని డిస్ట్రిబ్యూట్ చేశాడు.. అది ఏదో తెలుసా ?

పవన్ కళ్యాణ్ మూవీకి కొడాలి నాని డిస్ట్రిబ్యూట్ చేశాడు.. అది ఏదో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.  పవన్ కళ్యాణ్ ను రాజకీయ నాయకుడిగా అభిమానించేవారు ఎంతోమంది ఉంటే, హీరోగా అభిమానించే వారు కూడా అంతకు రెండింతలు ఉన్నారనే చెప్పవచ్చు. రాజకీయంగా వేర్వేరు పార్టీలు అయినా కూడా పవన్ కళ్యాణ్ ఒక సినిమా హీరోగా అభిమానించేవారు ప్రతి ఒక్క పార్టీలో ఉన్నార నడంలో ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ నటించిన కొన్ని సినిమాలే అయినప్పటికీ టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్  ఏర్పరచుకున్నాడు.

Advertisement

అంతేకాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ టాలీవుడ్ లో మరే హీరోకి లేదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ తో పలువురు దర్శక నిర్మాతలు సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తుంటారు. ఇకపోతే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కొక్క సినిమాకు రూ.65 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కొడాలి నాని కి సంబంధించిన ఒక వార్త  సోషల్ మీడియాలో  తెగ చక్కర్లు కొడుతోంది.  అసలు దేని గురించి అంటే  మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే అయిన కొడాలి నాని గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓ సినిమాకి ఎగ్జిబిటర్ గా పనిచేశాడనే  విషయం చాలా మందికి తెలియదు.

Advertisement

Also Read : భార్య మరణించిన తరువాత దిల్ రాజు ఆ టాప్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నారా ?

Jalsa

పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమా ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిందో  తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. జల్సా సినిమా అప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఆల్ టైం టాప్ 2 సినిమాగా కూడా నిలిచింది. ఇక కృష్ణాజిల్లాలో అయితే అప్పట్లో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ జల్సా సినిమాను కొడాలి నాని రైట్స్ కొనుగోలు చేసి కృష్ణా జిల్లాలో విడుదల చేశారట. ఈ ఆ సమయంలో కొడాలి నాని కి బాగానే లాభాలు వచ్చాయట. జల్సాతో పాటు చాలా సినిమాలకు కొడాలి నాని కృష్ణాజిల్లాలో డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారట.

Also Read :  ఈ ఫోటోలో ఉన్న ఎమ్మెల్యే చాలా ఫేమస్.. ఎవరో చెప్పుకోండి..!!

Visitors Are Also Reading