Home » ఈ ఫోటోలో ఉన్న ఎమ్మెల్యే చాలా ఫేమస్.. ఎవరో చెప్పుకోండి..!!

ఈ ఫోటోలో ఉన్న ఎమ్మెల్యే చాలా ఫేమస్.. ఎవరో చెప్పుకోండి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈ మధ్యకాలంలో కొంతమంది స్టార్ హోదా కలిగిన వ్యక్తుల గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అది ఏ విధంగా అంటే వారి చిన్ననాటి ఫోటోలు లేదంటే, సడన్ గా వారు ఏదైనా చేంజ్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి వీరు ఎవరో గుర్తుపట్టండి అంటూ టాస్క్ ఇస్తున్నారు.. అయితే మొన్నటి వరకు పూర్తి గడ్డంతో ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకుడు ప్రస్తుతం చాలా మారిపోయారు.

Advertisement

అప్పట్లో వేల మందిలో ఉన్న ఈ నాయకున్ని ఇట్టే గుర్తుపట్టేవారు.. ఇంకా గుర్తుకు రాలేదా ఆయనేనండి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఈయన గురించి ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే తెలంగాణ నేత సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి ( జగ్గారెడ్డి). ఆయన గెటప్ మిగిలిన రాజకీయ నాయకుల కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. పొడవైన గడ్డం, జూలపాల వంటి హెయిర్ స్టైల్ తో పక్కా మాస్ లీడర్ గా కనిపిస్తారు. కానీ ఆయనకు జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది, ప్రతి ఒక్కరితో కలిసిపోయే వ్యక్తిత్వం గల నాయకుడు.

Advertisement

అలాంటి జగ్గారెడ్డి తన గెటప్ ను మార్చేశారు. ఏడాదిలో రెండుసార్లు మాత్రమే గడ్డం తీసేసి జగ్గారెడ్డి క్లీన్ షేవ్ గుండుతో పసుపు పచ్చ, టీషర్ట్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఈ ఫోటోలు చూసిన చాలామంది అతన్ని గుర్తుపట్టలేకపోయారు. మరీ పరీక్ష పట్టి చూసి ఆయన జగ్గారెడ్డి కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆయన తిరుమల వెంకటేశ్వర స్వామిని తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని తలనీలాలు సమర్పించారు. దీంతో గెటప్ పూర్తిగా మారింది.

also read:

Visitors Are Also Reading