సాధారణంగా చిన్న పిల్లలు, ఆడవాళ్లు, పెద్దవాళ్లు, వారు వీరు అనే తేడా లేకుండా కొంత మంది నల్లదారం కట్టుకోవడం చూస్తుంటారం. ఇక చిన్న పిల్లలకు అయితే ఎక్కువగా దిష్టి తగలకుండా ఉండేందుకు నల్లదానం కడుతుంటారు. కొందరూ అయితే ఫ్యాషన్ గా కూడా ఇప్పుడు కడుతుంటారు. ఈ నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ముఖ్యంగా చిన్న పిల్లలకు, పెద్దవారు 11 రోజుల్లో కూడా నల్లదారం కట్టడం చూస్తుంటాం.వాస్తవానికి దిష్టికి నల్లతాడు అద్భుతంగా పని చేస్తుందని నమ్ముతుంటారు. పిల్లలకు ఆ ప్రెషర్ తగులుతుందని నమ్మవచ్చా… ఈ దిష్టి అనేది కంటికి కనిపించని ఒక పలుచని కాంతి వలయముంటుంది. శరీరం పలుచని కాంతి వలయం లాంటి ఆరా ఉంటుంది. ఎవరైనా సరే భలే ఉందంటే చాలు ఆ వలయానికి తూట్లు పడుతుంటాయి. ఆ సమయంలో పిల్లలు టపీ టపీమని కళ్లు తిరిగి కింద పడిపోతుంటారు. పదే పదే ఏడ్చేస్తుంటారు. చికాకు చేస్తుంటారు.పెద్దవారిలో అయితే నిద్ర సరిగ్గా పట్టదు. ఆవలిస్తుంటారు. సరైన అన్నం తినరు.. ఏ పని చేయకుండా బద్ధకంగా ఉంటారు. చికాకు అనేది చాలా పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ఆ సమయంలో ఉప్పుతో దిష్టి తీయడంతో వారికి ఉపశమనం కలుగుతుంది.
Advertisement
Also Read : ఎండు అల్లం అంటే మొగలు చక్రవర్తులకు ఎక్కువ ఇష్టం ఎందుకో తెలుసా..?
ఆరా అనేది ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా ఉంటుంది. నల్లదారం ఎందుకు కడతారంటే.. దిష్టి కానీ ఏదైనా గాలి, దూళి కానీ వచ్చినప్పుడు ఈ నల్లదారం దానిని లాగేసుకుంటుంది. ఎలాంటి చికాకు లేకుండా మనస్సుకి ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకుంటుంది. నల్ల దారాన్ని ఎవ్వరూ కడతారు.. కళ్లకి కనపడితే చాలు ఆ దిష్టి అనేది తాకకుండా ఉంటుంది. కొందరూ కాళ్లకి కాటుక పెడుతారు. అదేవిధంగా మరికొందరూ ముఖానికి కాటుక పెడుతారు. నరుడికి నల్లరాయి కూడా పగులుతుందనే సామెత కూడా ఉంటుంది. నలుపు కానీ పడితే చాలు ఆ దృష్టి అనేది తాకకుండా ఉంటుంది. ఈ నల్ల దారం నెల రోజులు మాత్రమే ధరించాలి. నల్లదారం అమవాస్య రోజు ధరించి మళ్లీ అమవాస్య రోజు పాతది విప్పేసి కొత్తది ధరించడం ఉత్తమం. ఇక కళ్లకు కాటుక, చిన్న పిల్లలకు నుదుటిన కాటుక పెడుతుంటారు. పెద్దవాళ్లయితే అరికాలికి కాటుక పెట్టుకోవాలి. కాలికి దారం కట్టుకోవాలి. నల్లదారం వల్ల చాలా ఉపయోగాలుంటాయి కాబట్టి నల్ల దారం కట్టుకోవడం చాలా మంచిది.
Also Read : ఈ రకమైన అరటిపండును తింటున్నారా..? అయితే, మీరు అనారోగ్యం పాలైనట్టే ..!