టీం ఇండియా యొక్క భవిష్యత్ కెప్టెన్ ఎవరు.. రోహిత్ శర్మ తర్వాత ఆ స్థానం ఎవరిది అనే ప్రశ్న వచ్చిన ప్రతిసారి వినిపించే మొదటిపేరు కేఎల్ రాహుల్. ప్రస్తుతం టీం ఇండియా యొక్క ముఖ్యమైన ఓపెనర్ గా జట్టులో కొనసాగుతున్న కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా కూడా బాధ్యతలు అనేవి నిర్వహిస్తున్నాడు. కానీ ప్రతి రెండు, మూడు సిరీస్ లకు రాహుల్ గాయపడటం అనేది జట్టుకు ఇబ్బందిగా మారింది. తాజాగా ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత ఇండియాలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ నుండి కెప్టెన్ రోహిత్ విశ్రాంతిని ఇచ్చింది బీసీసీఐ.
Advertisement
ఆ కెప్టెన్ స్థానంలో రాహుల్ ను నియమించింది. కానీ మ్యాచ్ కు ఒక్క రోజు ముందు రాహుల్ ప్రాక్టీస్ లో గాయపడ్డాడు. అందువల్ల అతను జట్టుకు దూరం కావడంతో రిషబ్ పంత్ కెప్టెన్ గా వ్యవరించాడు. ఇక కేఎల్ రాహుల్ కూడా గాయానికి శస్త్ర చికిత్స కోసం జర్మనీ వెళ్ళాడు. ఇక అక్కడ చికిత్స అనేది పూర్తి చేసుకున్న రాహుల్.. ఫిట్ గా లేకపోవడంతో ఇంగ్లాండ్ పర్యటనకు కూడా దూరంగా ఉన్నాడు. కానీ తాజాగా ఇంగ్లాండ్ పర్యటనను ముగించుకున్న టీం ఇండియా విండీస్ టూర్ కు వెళ్ళింది. అక్కడ మొదట వన్డే, తర్వాత టీ20 సిరీస్ అనేది జరగనుంది.
Advertisement
అయితే ఈ టీ20 జట్టులో కేఎల్ రాహుల్ చోటు అనేది దకించుకున్నాడు. కానీ అతను తన ఫిట్నెస్ అనేది నిరూపించుకుంటేనే జట్టులో ఉంటాడు అని బీసీసీఐ తెలిపింది. అయితే ప్రస్తుతం ఎన్సీఏలో ఉంటూ.. ఫిట్నెస్ పైన ఫోకస్ చేసిన కేఎల్ రాహుల్.. తాజాగా అక్కడ మహిళా బౌలర్ జులన్ గోస్వామి బౌలింగ్ లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో అనేది నెట్టింట వైరల్ గా మారింది. అయితే జులన్ కూడా ఇప్పుడు ఫిట్నెస్ నిరూపించుకోవడం కోసమే ఎన్సీఏలో ఉంటున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి :