Home » కేకేఆర్ ప్లేయర్ రింకు సింగ్ జీవితంలోని కష్టాల గురించి మీకు తెలుసా..?

కేకేఆర్ ప్లేయర్ రింకు సింగ్ జీవితంలోని కష్టాల గురించి మీకు తెలుసా..?

by Azhar
Ad

ఐపీఎల్ 2022లో చాలా మంది యువ ఆటగాళ్లకు పేరు వచ్చింది. అందులో రింకు సింగ్ కూడా ఒక్కడు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న రింకు సింగ్ కు ఆ జట్టు ఆడిన ఆఖరి మ్యాచ్ లో మంచి పేరు వచ్చింది. కేకేఆర్ తప్పకుండ ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ చివర్లో వచ్చిన రింకు సింగ్ 15 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టును గెలిపించినంత పని చేసాడు. ఆ మ్యాచ్ ఆఖరి ఓవర్లో రింకు ఔట్ అయ్యాడు కాబట్టి లక్నో గెలిచింది.. కానీ లేకుంటే కేకేఆర్ ను విజయం వరించేది.

Advertisement

ఇంత భారీ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత రింకు సింగ్ గురించి అభిమానులు తెలుసుకోవడం ప్రారంభించారు. అయితే చాలా మంది క్రికెటర్లు డబున కుటుంబాల నుండి వచ్చారు అనుకుంటారు. కానీ కొంత మంది అలా కాదు. అందులో రింకు సింగ్ కూడా ఒక్కడు. తన జీవితాం అలాగే కెరియర్ లో రింకు సింగ్ ఎన్నో బాధలు పడ్డాడు. 1997 అక్టోబర్ 12న ఉత్తరప్రదేశ్ లొని అలీగఢ్ లో జన్మించిన రింకు 2017 లో మొదటిసారి ఐపీఎల్ లో వచ్చాడు. కానీ ఆ తర్వాత జట్టు వదిలేసింది. అయితే దేశీయ టోర్నీలలో మంచిగా ఆడటంతో 2018 లో కేకేఆర్ జట్టులోకి 80 లక్షలకు వచ్చాడు రింకు సింగ్. ఇక్కడ కూడా సరిగ్గా ఆడలేదు. అయిన కూడా కోల్కతా జట్టు అతడిని తమతోనే ఉంచుకుంది.

Advertisement

ఇక ఆ తర్వాత నుండి ఇప్పటివరకు ఆ జట్టుతోనే ఉన్న రింకుకు వచ్చిన అవకాశాలు తక్కువే. ఇక ఈ ఐపీఎల్ ముందు దేశవాళీ టోర్నీ సమయంలో గాయపడిన రింకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు డాక్టర్ కనీసం 7 నెలలు దూరం ఉండాలి అని చెప్పాడు. దాంతో ఈ ఐపీఎల్ ఆడలేను అని భాదపడుతున్న రింకును చూసి వాళ్ళ నాన్నకు సరిగ్గా భోజనం చేయలేదు. ఎందుకంటే కుటుంబాన్ని ఇప్పుడు నడుపుతుంది రింకునే. అయితే ఐపీఎల్ ఆడలేను అనుకున్న రింకు త్వరగా కోలుకొని ఇప్పుడు ఐపీఎల్ 2022 లో మంచి పేరు తెచ్చుకున్నాడు.

ఇవి కూడా చదవండి :

పంజాబ్ ప్లే ఆఫ్స్ కు వెళ్లనందుకు ధావన్ కు దెబ్బలు.. కిందపడేసి మరి..?

RCB ని టైటిల్ పోరులో నిల‌బెట్టిన ఈ పాటిదార్ ఎవ‌రు? ఈ సిక్స్ మ్యాచ్ కే హైలెట్!!

Visitors Are Also Reading