Home » కెజిఫ్ 3 స్టోరీ ని లీక్ చేసిన కెజిఫ్ విలన్ ..! ఈ ట్విస్ట్ అస్సలు ఊహించనేలేదు గా..!

కెజిఫ్ 3 స్టోరీ ని లీక్ చేసిన కెజిఫ్ విలన్ ..! ఈ ట్విస్ట్ అస్సలు ఊహించనేలేదు గా..!

by AJAY
Ad

కన్నడ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజిఎఫ్ సినిమా రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కన్నడ తో పాటు తెలుగు హిందీ తమిళ భాషల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా 2 వారాల క్రితం కేజిఎఫ్ చాప్టర్-2 విడుదలైంది. కాగా చాప్ట‌ర్ 2 కు కూడా భారీ రెస్పాన్స్ వస్తోంది.

Advertisement

 

కేజిఎఫ్ భారీ విజయం సాధించడంతో ప్రశాంత్ నీల్ అంచ‌నాల‌ను రీచ్ అయ్యేలా కేజీఎఫ్ చాప్ట‌ర్ -2 ను తెర‌కెక్కించారు. ఇక ఈ చిత్రంలో నటించిన వాళ్లంతా తమ తమ పాత్రల్లో జీవించారనే చెప్పాలి. ప్రతి పాత్ర ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. అలాంటి పాత్రల్లో వానరం పాత్ర కూడా ఒకటి. వానరం అనే పాత్రలో నటించిన నటుడు పేరు అయ్యప్ప శర్మ. కాగా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో అయ్యప్ప శర్మ ఆసక్తికర కామెంట్ లు చేశాడు.

Advertisement

కేజిఎఫ్ చాప్టర్-2 చూసిన తర్వాత అందరూ చాప్ట‌ర్ 3 కూడా వస్తుందని భావించారు. దీనిపై చిత్ర యూనిట్ కూడా క్లారిటీ ఇచ్చింది. ఇక‌ తాజా ఇంటర్వ్యూలో కూడా అయ్య‌ప్ప శ‌ర్మ‌కు ఇలాంటి ప్రశ్ననే ఎదురైంది. కేజిఎఫ్ చార్టర్-3 ఉంటుందా అని అడగగా తప్పకుండా ఉంటుంది అని సమాధానమిచ్చాడు. అందుకే తాను బ్రతికి ఉన్నాను అంటూ చెప్పాడు.

ఇదిలా ఉంటే చార్టుర్-2 లో హీరో చనిపోయినట్టు చూపించిన సంగతి తెలిసిందే. కానీ హీరో చనిపోయిన‌ట్టు చూపిస్తారని కానీ చాప్ట‌ర్ 3లో తిరిగి వ‌స్తాడ‌ని అదే ఈ సినిమా క‌థ అని కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కేజీఎఫ్ చాప్ట‌ర్ 1, కేజీఎఫ్ చాప్ట‌ర్-2 లు భారీ విజ‌యాల‌ను అందుకున్నాయి. మ‌రి చాప్ట‌ర్ -3 ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

ALSO READ :

40 దాటినా పెళ్లి చేసుకోని స్టార్ హీరోయిన్లు..! లవ్ ఫెయిల్యూర్ వల్లేనా…?

పెళ్లిళ్లు, శుభ‌కార్యాల్లో చదివింపులు 100, 500 కాకుండా రూ.101, రూ.501 కానుక ఇస్తారు ఎందుకో తెలుసా..?

Visitors Are Also Reading