Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » KGF 2 Review in Telugu: కెజిఫ్ 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది ! సినిమాకి అదొక్కటే నెగటివ్ అట లేకుంటే …!

KGF 2 Review in Telugu: కెజిఫ్ 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది ! సినిమాకి అదొక్కటే నెగటివ్ అట లేకుంటే …!

by Azhar
Published: Last Updated on
Ads

ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన కేజీయ‌ఫ్ సినిమా ఎంత భారీ విజయం సాధించిందో అందరికి తెలుసు. డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌, హీరో య‌శ్ పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. ప్ర‌శాంత్ నీల్‌ ఇప్పటికే ప్రభాస్ తో సినిమా చేస్తుండగా… య‌శ్ కు కూడా భారీ ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ప్రస్తుతం అభిమానుల దృష్టి మొత్తం కేజీయ‌ఫ్ 2 మీదనే ఉంది. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో.. అప్పుడు బాహుబలి 2 మీద ఎంత బజ్ ఉందొ.. ఇప్పుడు ఈ సినిమా పైన కూడా అంతే బజ్ ఉంది. అయితే ఈ నెల 14న విడుదల అవుతున్న కేజీయ‌ఫ్ 2 మొదటి రివ్యూ వచ్చేసింది.

Advertisement

kgf-2-movie-review

kgf-2-movie-review

యూఏఈ సెన్సార్ బోర్డు స‌భ్యుడు మరియు సినీ అన‌లిస్ట్ అయిన ఉమైర్ సంధు కేజీయ‌ఫ్ 2 పై తన రివ్యూ ఇచ్చేసారు. అభిమానుల అంచనాలకు తగ్గట్లుగానే.. ఈ సినిమా మొదటి నుండి చివ‌రి వ‌ర‌కు హై ఓల్టేజ్ యాక్ష‌న్ సీక్వెన్స్‌ లతో నిండిపోయి ఉంటుంద‌ని ఆయన చెప్పారు. ఈ సినిమాలోని డైలాగులు అభిమానులను తెగ ఆకట్టుకుంటాయి అని అన్నారు.

Ad

Advertisement

అలాగే కేజీయ‌ఫ్ మొదటి భాగం అంత హిట్ కావడంలో ముఖ్యపాత్ర పోషించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ రెండవ భాగంలో కూడా అదిరిపోయిందని చెప్పారు. ఈ సినిమాలో య‌శ్‌ తో పాటుగా సంజ‌య్‌ద‌త్ పాత్ర‌ కూడా హైలెట్ గా నిలుస్తుంది అని ఆయన అన్నారు. ఈ సినిమా క్లైమాక్స్ అభిమానుల ఊహలకు కూడా అందదని… దానిని ఎవరు ఊహించలేరు అన్నారు. అయితే కేజీయ‌ఫ్ 2 కేవ‌లం క‌న్న‌డ సినిమానో.. ఇండియా సినిమానో కాదని.. ఇది ఒక వ‌ర‌ల్డ్ క్లాస్ మూవీ అని ప్రశంసించారు.

Also Read: తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న 5 డ‌బ్బింగ్ సినిమాలు..!

Visitors Are Also Reading