Home » Tollywood Dubbed Movies: టాలీవుడ్ లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న 5 డ‌బ్బింగ్ సినిమాలు..!

Tollywood Dubbed Movies: టాలీవుడ్ లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న 5 డ‌బ్బింగ్ సినిమాలు..!

by AJAY
Ad

కన్నడ స్టార్ హీరో యష్ హీరో గా నటించిన కేజిఎఫ్ సినిమా దేశవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అన్ని భాషల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు ప్రేక్షకులు సైతం ఈ సినిమాకు ఫిదా అయ్యారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా కేజిఎఫ్ పార్ట్ 2 తెర‌కెక్కిక‌న‌ సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.

Advertisement

అంతేకాకుండా తెలుగులో అత్యధిక రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాగా కేజిఎఫ్ పార్ట్ 2 రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలలో 78 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వ‌ర్గాల సమాచారం. ఇక ఈ సినిమా కంటే ముందు మరికొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నాయి. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం…

Advertisement

రజనీకాంత్ హీరోగా నటించిన రోబో 2.0 కూడా అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న డబ్బింగ్ సినిమాల్లో నిలిచింది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలలో 71 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

శంకర్ దర్శకత్వంలో వచ్చిన మరో సినిమా ఐ. విక్రమ్ అమీజాక్సన్ జంటగా నటించిన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలలో 39 కోట్ల రిలీజ్ బిజినెస్ చేరుకుంది.

రజనీకాంత్ హీరోగా నటించిన కాలా సినిమా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 33 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది.


రజనీకాంత్ హీరోగా నటించిన మరో సినిమా కబాలి. ఈ సినిమా కూడా తెలుగులో అత్యధిక రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలలో 31 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇదిలా ఉంటే తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న డబ్బింగ్ సినిమాల్లో మూడు సినిమాలు రజనీకాంత్ చేసిన‌వే కావ‌డం విశేషం.

Visitors Are Also Reading