Home » రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం.. రూ.500 కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ కి గ్రీన్ సిగ్నల్

రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం.. రూ.500 కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ కి గ్రీన్ సిగ్నల్

by Anji
Published: Last Updated on
Ad

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఈరోజు భేటీ అయింది. మొత్తం 25 అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించింది. ఈ భేటీలో కేబినెట్ పలు కీలక నిర్ణయలు తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేసింద. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే వాహనాల నెంబర్ ప్లేట్ లను TS నుంచి TG గా మారుస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర గీతంగా జయజయహే తెలంగాణకు ఆమోదం తెలిపింది. ఈ నెల 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

Advertisement

Advertisement

ఎన్నికల సమయంలో ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. తాజాగా రాష్ట్ర కేబినెట్ ఈ పథకానికి ఆమోదం తెలిపింది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారే ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది రేవంత్ సర్కార్. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల తరువాత ఈ పథకం అమల్లోకి రానుంది.  గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి బాబోయ్ అని ఆందోళన చెందుతున్న సామాన్య కుటుంబాలకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. ఎన్నికల సమయంలో మహాలక్ష్మి పథకం కింద రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించనుంది. ఈ పథకం అమలుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.  తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ ఈ పథకం త్వరలో అమల్లోకి రానుంది.

 

2014 లో తెలంగాణ ఏర్పడిన తరువాత వాహనాల నెంబర్ ప్లేట్లకు కేంద్ర ప్రభుత్వం టీజీని  ఆమోదించింది.. కానీ ఆనాటి సీఎం కేసీఆర్ వాస్తు కోసమని టీజీని టీఎస్ గా మార్చాలని కేంద్రానికి లేఖ పంపినట్లు గతంలో కొన్ని మీడియా కథనాలు వచ్చాయి. అయితే.. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి తమ పార్టీ అధికారంలోకి వస్తే TS ను TGగా మారుస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Visitors Are Also Reading