Home » పెళ్లి పీటలు ఎక్కబోతున్న కేరింత హీరోయిన్…వరుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు ..!

పెళ్లి పీటలు ఎక్కబోతున్న కేరింత హీరోయిన్…వరుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు ..!

by AJAY
Ad

కాలేజీ బ్యాక్ డ్రాప్ లో టాలీవుడ్ వచ్చి మంచి విజయం సాధించిన సినిమా కేరింత. ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయింది. కాలేజీ రోజుల్లో ప్రేమ, స్నేహం విద్యార్థుల మధ్య అనుబంధాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఈ సినిమాకు సాయికిరణ్ అడివి దర్శకత్వం వహించారు. అంతేకాకుండా దిల్ రాజు ఈ సినిమాను కొత్త వాళ్లతో నిర్మించారు.

Advertisement

అయితే ప్రధాన పాత్రలో మాత్రం సుమంత్ అశ్విన్ నటించారు. ఇక సినిమాలో భావన పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పార్వతీశం అనే విలేజ్ యువకుడిని ప్రేమించే పాత్రలో భావన నటించింది. పార్వతీశం ను సరైన దారిలో పెడుతూ భావన అతడికి సపోర్ట్ గా నిలబడడం ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. సినిమాకే ఈ పాత్ర హైలెట్ గా నిలిచింది.

Advertisement

అయితే భావన పాత్రలో నటించిన అమ్మాయి చాలామందికి గుర్తుంది కానీ ఆమె అసలు పేరు మాత్రం ఎవరికీ తెలియదు. భావన పాత్రలో నటించిన అమ్మాయి అసలు పేరు సుకృతి… అందం మరియు అభినయంతో సుకృతి ప్రేక్షకులను ఫిదా చేసింది. అయితే కేరింత సినిమా తర్వాత కొన్ని చిన్న సినిమాలలో నటించినా అవి పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత సుకృతి సినిమాలకు దూరమైంది.

 

కానీ సోషల్ మీడియాలో మాత్రం సుకృతి అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా సుకృతి పెళ్లికి రెడీ అవుతోంది. అక్షయ్ సింగ్ అనే వ్యక్తితో సుకృతి పెళ్లి జరగనుంది. వీరిద్దరూ ప్రేమించుకోగా ఇప్పుడు పెద్దలను ఒప్పించి పెళ్లికి రెడీ అవుతున్నారు. ఇక అక్షయ్ సింగ్ వ్యాపారవేత్త అని తెలుస్తోంది. ఇక తాజాగా సుక్రుతి హల్దీ ఫంక్షన్ ఫోటోలను షేర్ చేయగా నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతూ ఫోటోలకు కామెంట్లు పెడుతున్నారు.

Visitors Are Also Reading