ప్రస్తుతం ప్రపంచం మొత్తం టెక్నాలజీలో దూసుకుపోతున్న గాని కొంతమంది మూఢనమ్మకాల చుట్టే తిరుగుతూ చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఈ విధంగా నమ్మేవారిలో చాలామంది చదువుకున్న వారు, ఉద్యోగాలు చేసేవారు కూడా ఉంటున్నారు.. అలాంటి మూఢనమ్మకంతో తను కట్టుకున్న భర్తనే చివరికి విషమిచ్చి చంపేసిన దారుణ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే.. కాలం మారింది, మనుషులు మారుతున్నారు.. ఒకప్పుడు అమ్మాయిలు అంటే వంటింటికే పరిమితమై ఉండేవారు. కానీ ఇప్పుడు అబ్బాయిలతో సమానంగా పోటీపడుతూ అన్నిట్లో దూసుకుపోతున్నారు.
Advertisement
also read:నువ్వే కావాలి సినిమాను మిస్ చేసుకున్న అన్ లక్కీ హీరో ఎవరో తెలుసా..?
ప్రస్తుత కాలంలో అమ్మాయిల క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ అమ్మాయి కూడా అలాగే ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకొని చివరికి మూఢనమ్మకంతో కట్టుకున్న భర్త ప్రాణాలు తీసింది.. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఈ ఘటన జరిగింది.. కేరళకు చెందిన షారన్, తమిళనాడుకు చెందిన గ్రీష్మ ప్రేమించు కున్నారు. త్వరలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంతలోనే గ్రీష్మ తల్లిదండ్రులు ఒక డబ్బున్న వ్యక్తిని గ్రీష్మ కు భర్తగా చూశారు. గ్రీష్మ కు కూడా ఆ సంబంధం నచ్చడంతో ప్రియుడ్ని ఎలాగైనా వదిలించుకోవాలనుకుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది.
Advertisement
గ్రీష్మ తను పెళ్లి చేసుకునె మొదటి భర్త చనిపోతారని ఒక జ్యోతిష్యుడు చెప్పడంతో, అవి నమ్మిన వారు తన కుటుంబ సభ్యులతో కలిసి శారన్ హత్యకు ప్లాన్ చేసింది. ప్లాన్ లో భాగంగానే గ్రీష్మకు శారన్ తో చర్చిలో పెళ్లి జరిపించారు. తర్వాత కొద్ది రోజులు కలిసి ఉన్నారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని గ్రీష్మ ఇంటికి వెళ్ళాడు షారన్. అక్కడ ఇద్దరు దంపతులు జ్యూస్ తాగే పోటీ పెట్టుకున్నారు. షారన్ తాగే జ్యూస్ లో కాపర్ సల్ఫేట్ కల్పింది గ్రీష్మ. దాన్ని తాగిన షారన్ అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆస్పత్రిలో మరణించాడు. విషం తాగిన కారణంగానే షారన్ మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో షారను కుటుంబ సభ్యులు మృతి పై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గ్రీష్మను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపడింది. జ్యూస్ ఛాలెంజ్ పేరుతో గ్రీష్మ షారనును చంపినట్లు ఒప్పుకుంది..
also read: