Home » నువ్వే కావాలి సినిమాను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా..?

నువ్వే కావాలి సినిమాను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా..?

by AJAY
Ad

ఇండ‌స్ట్రీలో ఒక హీరోతో అనుకున్న సినిమాను మ‌రో హీరోతో చేసిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయి. ఒక హీరో కోసం క‌థ రెడీ చేసుకుంటే ఆ హీరో రిజెక్ట్ చేయ‌డ‌మో ఇత‌ర కార‌ణాల వ‌ల్ల‌నో సినిమాలు చేతులు మారుతుంటాయి. అలా చేతులు మారిన సినిమాలు కొన్ని ఫ్లాప్ అయితే మ‌రికొన్ని మిస్ చేసుకున్న హీరో దుర‌దృష్టం వ‌ల్ల బ్లాక్ బ‌స్ట‌ర్ లు అవుతుంటాయి. అలా నువ్వే కావాలి సినిమాను కూడా ఓ హీరో మిస్ చేసుకున్నాడు.

Advertisement

త‌రుణ్ హీరోగా న‌టించిన నువ్వేకావాలి సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమాలో త‌రుణ్ కు జోడీగా రిచా హీరోయిన్ గా న‌టించింది. కే. విజ‌య‌భాస్క‌ర్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌ల‌యాళంలో వ‌చ్చిన నీర‌మ్ అనే సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమాకు త్రివిక్ర‌మ్ ర‌చ‌యిత‌గా ప‌నిచేశారు.

Advertisement

ఆయ‌న రాసిన మాట‌లు నువ్వే కావాలి సినిమాకు ప్రాణం పోశాయి అని చెప్ప‌డంలో ఎలాంటి డౌట్ అక్క‌ర్లేదు. ఈ సినిమాను ఉషాకిర‌ణ్ మూవీస్ బ్యాన‌ర్ పై రామోజీరావు నిర్మించారు. ఈ ప్రేమ‌క‌థా చిత్రానికి ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు. సినిమాలో పాటలు డైలాగులు, న‌టీన‌టుల ప‌ర్ఫామెన్స్ ఇలా ప్ర‌తిఒక్క‌టి సినిమాకు హైలెట్ గా నిలిచాయి. అయితే ఈ సినిమాకు మొద‌ట అనుకున్న హీరో మాత్రం త‌రుణ్ కాదు.

మొద‌ట ఈ సినిమా క‌థ‌ను హీరో సుమంత్ కు వినిపించార‌ట‌. అక్కినేని వార‌సుడుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సుమంత్ ఈ సినిమాను రిజెక్ట్ చేశార‌ట‌. దాంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా న‌టించి ఆ త‌ర‌వాత ఓ యాడ్ లో మెరిసిన త‌రుణ్ ను చూసిన ద‌ర్శ‌కుడు పిలిపించి నువ్వేకావాలి సినిమా క‌థ వినిపించారు. అలా సుమంత్ మిస్ చేసుకున్న క‌థ‌తో త‌రుణ్ స్టార్ అయ్యాడు.

Visitors Are Also Reading