Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » Ramba car accident: హీరోయిన్ రంభ కారుకు యాక్సిడెంట్..!!

Ramba car accident: హీరోయిన్ రంభ కారుకు యాక్సిడెంట్..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

సీనియర్ హీరోయిన్ రంభ కార్ కి యాక్సిడెంట్ జరిగింది. వారి పిల్లలను స్కూల్ నుంచి తీసుకువస్తుండగా ఘటన జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఈ యాక్సిడెంట్ లో రంభ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆమె ప్రయాణం చేస్తున్న కారు మంగళవారం ఉదయం ఈ ప్రమాదానికి గురైందని తెలుస్తోంది. కారులో ఆమెతోపాటు పిల్లలు, చిన్నారుల సంరక్షణ చూసుకునే వారు ఒకరు ఉన్నారట. ఈ ప్రమాదంలో పెద్దగా ఎవరికి గాయాలు కాలేదని రంభ తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Advertisement

Ad

also read:అతిగా ఆ పని చేయ‌డం వ‌ల్లే స‌మంతకు మ‌యోసైటిస్ వ్యాధి వ‌చ్చిందా..?

రంభ వారి పిల్లలను స్కూలుకు తీసుకువస్తుండగా ఇంటర్ సెక్షన్ దగ్గర మా కారును మరో కారు ఢీ కొట్టిందని, ఆ కారులో నాతో పాటుగా పిల్లలు ఆయా ఉన్నారని, పెద్దగా గాయాలు ఏమీ కాలేదని అందరం సేఫ్ గా ఉన్నామని తెలియజేశారు. చిన్నారి శాష ఇంకా ఆస్పత్రిలోనే ఉంది.. బ్యాడ్ టైం నడుస్తోంది.. మా కోసం దేవున్ని ప్రార్థించండి.. చిన్నారిని త్వరగా కోలుకోవాలని కోరుకోండి.

మీ ప్రార్థనలు మాకు ఎంతో అవసరం అని రాంబా సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఆస్పత్రిలో ఉన్న చిన్నారి ఫోటోతో పాటు కార్ యాక్సిడెంట్ ఫోటోలు రంబ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఖరీదైన కారు కావడంతో యాక్సిడెంట్ అయిన వెంటనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినట్టు తెలుస్తోంది. అందువల్ల ఎవరికి పెద్దగా గాయాలు కాలేదు. కానీ డోర్స్ మాత్రం చాలా డ్యామేజ్ అయ్యాయి. ఈ పోస్టు చూసిన రంభ అభిమానులు అంతా షాక్ అయ్యారు. తన కూతురు త్వరగా కోలుకోవాలని కామెంట్ల ద్వారా కోరుకుంటున్నారు.

Advertisement

also read:

Visitors Are Also Reading