Telugu News » Blog » బీజేపీ కాంగ్రెస్ ప్రజలను బానిసలను చేస్తున్నాయి : కేజ్రీవాల్

బీజేపీ కాంగ్రెస్ ప్రజలను బానిసలను చేస్తున్నాయి : కేజ్రీవాల్

by AJAY
Ads

ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ వాళ్ళు రెండు వందల సంవత్సరాల పాటు భారతీయులను బానిసలుగా చేసి పాలిస్తే ఇప్పుడు బిజెపి, కాంగ్రెస్ తమ విధానాలతో ప్రజలను బానిసలను చేస్తున్నాయని ఆరోపించారు. ఢిల్లీలో తాము అధికారంలోకి వచ్చి పాలనను సరి చేశామని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు పంజాబ్ కూడా నీతి వంతమైన పాలన జాబితాలో చేరింది అని చెప్పారు.

Advertisement

Advertisement

తమకు రాజకీయాలు చేత కాదని మంచి చేయడం.. అవినీతిని పారదోలడమే తెలుసు అని కేజ్రివాల్ అన్నారు. ఇదిలా ఉండగా పంజాబ్ లో ఆమ్ ఆద్మీ అనూహ్య విజయం తర్వాత కేజ్రీవాల్ జోష్ పెంచిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ బిజెపి లపై కేజ్రీవాల్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలని కేజ్రీవాల్ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సౌత్ పై కూడా కేజ్రీవాల్ కన్నేశారు.