Home » నేడు MLA గా కేసీఆర్ ప్రమాణస్వీకారం…!

నేడు MLA గా కేసీఆర్ ప్రమాణస్వీకారం…!

by Sravya
Ad

బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈరోజు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేసీఆర్ ఉదయం శాసనసభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కేసీఆర్ తో ప్రమాణం చేయించబోతున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు సహా బిఆర్ఎస్ ముఖ్య నేతలు అందరూ కూడా హాజరవుతున్నారు. ఆ తర్వాత అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత ఛాంబర్ లో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోయింది.

Advertisement

Advertisement

మ్యాజిక్ ఫిగర్ కి 60 సీట్లు కావాల్సి ఉండగా ప్రజలు 39 స్థానాలకి పరిమితం చేశారు. అధికార కాంగ్రెస్ కి 64 స్థానాలు అప్పగించారు ప్రజలు. అయితే ఎన్నికల్లో కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేశారు. గజ్వేల్ లో గెలుపొందిగా కామారెడ్డి లో రెండో స్థానానికే పరిమితమయ్యారు అక్కడ అనూహ్యంగా బిజెపి పార్టీ కాటేపల్లి వెంకటరమణారెడ్డి గెలిచారు. ఫలితాలు తర్వాత ఫామ్ హౌస్ కి వెళ్ళిపోయారు కేసీఆర్ అక్కడ కాలు జారీ పడడంతో తుంటి ఎముక విరిగిపోయింది ఇంతకాలం రెస్ట్ తీసుకొని ఈరోజు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు కెసిఆర్.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading