పార్లమెంట్ ఎన్నికలకు బిఆర్ఎస్ పార్టీ సన్నతమవుతోంది. గెలుపే లక్ష్యంగా పెట్టుకుని తీవ్ర కసరత్తు చేస్తోంది. జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కేడర్ బలహీనపడింది. వచ్చే లోకసభ ఎన్నికల్లో ఎలా అయినా సరే మెజార్టీ స్థానాలని దక్కించుకోవాలని చూస్తోంది. దీనిలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయా పార్లమెంట్ నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో సమావేశాలని నిర్వహించారు. పార్టీ శ్రేణులని ఉత్తేజపరుస్తూ ఎన్నికల మూడ్ లోకి తీసుకువచ్చే విధంగా ట్రై చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తూ కార్యకర్తలని చైతన్యపరిచారు. గ్యారెంటీలు అమలు చేయకపోతే ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని కేటీఆర్ అన్నారు.
Advertisement
కెసిఆర్ కూడా రంగంలోకి దిగారు రాజకీయాలని ఎప్పటికప్పుడు కేసీఆర్ తెలుసుకుంటున్నారు లోక్సభ ఎన్నికల కి సమయం లేకపోవడంతో ఎలా అయినా మెజారిటీ సీట్లలో విజయాన్ని సాధించాలని చూస్తున్నారు. ఎంపీలతో భేటీ అయ్యారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు పై నేతలతో మేధోమధనం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ 39 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుని ప్రతిపక్షంలో కూర్చుంది. ఊహించని ఓటమితో పార్టీ నేతలు అందరూ కూడా షాక్ కి గురయ్యారు. లోక్సభ ఎన్నికల్లో వచ్చేలోగా 6 గ్యారంటీలని అమలు చేయాలని బీఆర్ఎస్ ఒత్తిడి తెస్తోంది.
Advertisement
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!