లిక్కర్ కేసులో ఈడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది కల్వకుంట్ల కవిత. లిక్కర్ కేసులో ఈడి విచారణను కల్వకుంట్ల కవిత ఎర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈడి విచారణలో హైడ్రామా చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం నుంచి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ లతోపాటు ఎంపీలతో కలిసి కార్యాచరణ పై కల్వకుంట్ల కవిత చర్చింది.
Advertisement
అనంతరం ఈడీ విచారణకు డుమ్మా కొట్టింది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అనారోగ్య కారణాలతో విచారణకు హాజరుకాలేనని ఈడీకి చెప్పిన కవిత..ఈడీ విచారణకు డుమ్మా కొట్టింది. ఇవాళ ఉదయం 10 గంటలకు మీడియాతో మాట్లాడుతానని తొలుత సమాచారం ఇచ్చిన కవిత…అనంతరం న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత అనారోగ్య కారణాల దృష్ట్యా విచారణకు హాజరు కాలేనని ఈడీకి లేఖ రాసింది.
Advertisement
ఇక ఇవాళ ఉదయం 11:30 గంటలకు కవిత రాసిన లేఖను తీసుకొని ఈడీ ఆఫీసుకు బయలుదేరింది న్యాయ నిపుణుల బృందం. అడ్వకేట్ సోమా భరత్ నేతృత్వంలోని న్యాయ నిపుణుల బృందం 11:40కి ఈడి అధికారులను కలిశారు. అనంతరం 11 గంటల 57 నిమిషాలకు ఢిల్లీ పోలీస్ ఎస్కార్ట్ వాహనం కెసిఆర్ నివాసం నుంచి బయటకు వెళ్లి పోయింది. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also : సమంతకు సెంటిమెంట్ కూడా ఉందా.. అందుకే ఆ రంగు రాళ్ళను దరిస్తుందా.. దీనికీ కారణం