Home » శృతి హాస‌న్ కు అనుకున్నంత గుర్తింపు రాలేదా? 12 ఏళ్ల ఆమె కెరీర్ ను ఒక‌సారి ప‌రిశీలిస్తే!

శృతి హాస‌న్ కు అనుకున్నంత గుర్తింపు రాలేదా? 12 ఏళ్ల ఆమె కెరీర్ ను ఒక‌సారి ప‌రిశీలిస్తే!

by Azhar
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, కమల్ హాసన్ కూతురు శృతి హాసన్. ఈమె గురించి తెలుగు ప్రేక్ష‌కులంద‌రికి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర లేదు. ఇక ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉంది. శృతిహాసన్ కేవలం నటిగానే కాకుండా సింగర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా తన తండ్రి నటించిన ఈనాడు సినిమాలో కూడా ఓ పాటను పాడింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషలలో కూడా నటించింది. ఇక శృతిహాస‌న్ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన కొత్త‌లో తాను న‌టించిన చిత్రాల‌న్నీ కూడా దాదాపు ఫ్లాప్ అయ్యాయి. దాంతో అమ్మ‌డిది ఐర‌న్ లెగ్ అని కూడా అన్నారు. ఆ త‌ర్వాత నిధానంగా ఒక్కోసినిమా హిట్ అవ్వ‌డం మొద‌ల‌య్యాయి. టాలీవుడ్ లో ఉన్న దాదాపు అగ్ర‌హీరోల స‌ర‌స‌న న‌టించింది.

Advertisement

అయితే శృతి ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టి దాదాపు ప‌న్నెండేళ్ళ‌యింది. కానీ ఆశించినంత గొప్ప పేరు ప్ర‌ఖ్యాత‌ల‌యితే ఏమీ సాధించ‌లేక‌పోయింది. ఆమె కెరియ‌ర్ మొత్తంలో చెప్పుకోద‌గ్గ సినిమా అంటూ పెద్ద‌గా ఏమీ లేద‌నే చెప్పాలి. ఇక‌పోతే ఎంతో మంది హీరోయిన్లు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో కూడా న‌టించారు. శృతి మాత్రం కేవ‌లం గ్లామ‌ర్‌కే ప‌రిమితం ఉన్నపాత్ర‌ల్లో న‌టించింది. కానీ తాన న‌టించే పాత్ర‌కి పెద్ద పీట వేసేలా ఒక్క చిత్రంలో కూడా న‌టించ‌లేదు. పైగా క‌మ‌ల్‌హాస‌న్‌కి ఎంత పెద్ద పేరు ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అంత పెద్ద స్టార్ హీరో కుమార్తె అయి ఉండి కూడా పెద్ద‌గా పేరు ఉన్న పాత్ర‌లో ఒక్క చిత్రం కూడా న‌టించ‌లేదు.

Advertisement

ఇదిలా ఉంటే.. గ‌త కొన్ని రోజుల క్రితం సినిమాలకు గుడ్ బై చెప్పేయాల‌నుకుంద‌ట‌. నిజానికి కెరీర్ మొదట్లో ఇండస్ట్రీకి శృతిహాసన్ సింగర్ గా పరిచయమైంది. ఆ తర్వాత తన తండ్రి నటించిన సినిమాతో అడుగు పెట్టి ఆ తర్వాత పలు సినిమాలలో నటించగా హీరోయిన్ గా మారింది. తనకు సంగీతం అంటే ఎంతో ఇష్టమని.. ఆ సంగీతం మీద ఆసక్తితోనే సినిమాలోకి వచ్చానని ఓ సారి మీడియా స‌మావేశంలో తెలిపింది. తను చదువుకునే సమయంలో రాక్ స్టార్ అవ్వాలని అనుకుందట. సొంతంగా రాక్ బ్యాండ్ కూడా నడిపించాలని అనుకుందట. మొద‌ట్లో ఫొటోగ్రాఫ‌ర్‌తో ప్రేమ‌లో ప‌డ్డ ఈ బ్యూటీ కొన్ని కార‌ణాల వ‌ల్ల బ్రేక‌ప్ చెప్పుకుంది. ఆ త‌రువాత మ‌రో వ్య‌క్తిని ప్రేమించ‌గా త‌న‌లో కొన్ని మార్పులు ఉండ‌డంతో అతడిని కూడా వ‌దులుకుంది. ఇక వీరిద్ద‌రి వ్య‌వ‌హారం దాదాపు పెళ్ళి వ‌ర‌కు వెళ్ళింది. ఇద్ద‌రి మ‌ధ్య ఏమ‌యిందో ఏమిటో తెలియ‌దు కాని మొత్తానికి విడిపోయారు.

ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ సలార్ లో హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా ఓ వెబ్ సిరీస్ లో కూడా బిజీగా ఉంది శృతి హాసన్. టాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకొని బిజీగా మారింది శృతి హాసన్ . ఇప్పటికే సాలార్ షూటింగ్ లో బిజీగా ఉన్న అమ్మడు ఇటీవలే బాలయ్యతో బంపర్ ఆఫర్ పట్టేసింది. గోపీచంద్ మలినేనితో మూడో సారి పనిచేయడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేసింది ఈ అమ్మడు. మొత్తానికి ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఇన్నేళ్ళ‌యినా స‌రైనా గుర్తింపు అయితే పొంద‌లేద‌ని చాలా మంది అభిమానులు భావిస్తున్నారు.

Visitors Are Also Reading