Home » దినేష్ కార్తీక్: భార్య, ప్రాణస్నేహితుడు కలిసి మోసం చేస్తే.. అవమానం తట్టుకొని పడిలేచిన కెరటం కార్తీక్.. చివరికి..?

దినేష్ కార్తీక్: భార్య, ప్రాణస్నేహితుడు కలిసి మోసం చేస్తే.. అవమానం తట్టుకొని పడిలేచిన కెరటం కార్తీక్.. చివరికి..?

by Sravanthi
Ad

ప్రతి ఒక్కరి జీవితంలో అనుకోని సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఆ సంఘటనలు తలచుకుంటూ చాలామంది తమ జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది అదే తలుచుకుంటూ ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. కానీ జీవితం అనేది అలల లాంటిది. అలలు పడుతూ లేస్తూ చివరికి తీరాన్ని చేరుతాయి. అలాంటి జీవితమే దినేష్ కార్తీక్ ది. ఇండియన్ క్రికెట్ లో ఎంతో ఫేమస్ ప్లేయర్. కానీ కానీ తన వైవాహిక జీవితంలో దారుణంగా వైఫల్యం చెందారు.. చివరికి చావు దగ్గర దాకా వెళ్లారు.. కానీ అన్ని దాటుకొని మళ్లీ సక్సెస్ బాట పట్టారు.. అది ఎలాగో ఆ కథేంటో ఓసారి చూడండి..?

Advertisement

తమిళనాడుకు చెందినటువంటి క్రికెటర్ దినేష్ కార్తీక్ అంటే తెలియని వారు ఉండరు. కానీ అతని వైవాహిక జీవితంలో జరిగిన విషాదం మాత్రం చాలామందికి తెలియదు. 2004లో ఇండియన్ ఆటగాడిగా తన కెరీర్ స్టార్ట్ చేసాడు. తన ఆటతీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే తన చిన్ననాటి స్నేహితురాలు నికితను పెళ్లి చేసుకున్నాడు. వారి జీవితం చాలా బాగా సాగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే అనుకోని సంఘటన ఎదురైంది. దినేష్ కార్తీక్ మరియు తమిళనాడు మరో క్రికెటర్ మురళీ విజయ్ ప్రాణస్నేహితులు. దీంతో విజయ్ తరచు దినేష్ ఇంటికి వచ్చేవాడు. ఈ సందర్భంలోనే దినేష్ కార్తీక్ భార్యతో పరిచయం ఏర్పడింది. అయితే నికిత కూడా మురళిని చాలా ఇష్టపడింది. కానీ వీరిద్దరి మధ్య జరుగుతున్న తతంగాన్ని దినేష్ పసిగట్టలేకపోయాడు.

మురళీ విజయ్ మరియు నిఖిత అందరికీ తెలిసేలా సన్నిహితంగా బయట కూడా తిరగడం మొదలుపెట్టారు. ఆ సమయంలో తమిళనాడు క్రికెట్ టీమ్ లో అందరికీ విషయం తెలిసిపోయింది. కానీ దినేష్ పట్టించుకోలేదు. 2012లో మురళి విజయ్ వల్ల ఆమె గర్భవతి అయింది. అప్పుడు దినేష్ కు పూర్తిగా అర్థమైంది. దీంతో ఆ గర్భానికి నేను కారణం కాదు అని గొడవకు దిగారు. ఈ విధంగా ఇద్దరు విడాకులు తీసుకోవడానికి కారణం అయింది. విడాకులు తీసుకున్న మరుసటి రోజే నికిత విజయ్ ని పెళ్లి చేసుకున్నారు. దీంతో దినేష్ తట్టుకోలేక భార్య మోసాన్ని జీర్ణించుకోలేక అతని జీవితం అంధకారంగా తయారయింది. క్రికెట్ లో ఫెయిల్యూర్ అవుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే మొదట టీంకు కూడా దూరమయ్యాడు. తర్వాత తమిళనాడు జట్టుకు దూరం అయిపోయాడు. ఈ క్రమంలోనే మురళి తమిళనాడు జట్టుకు కెప్టెన్ గా నియమించబడ్డారు. ఈ విధంగా దినేష్ కార్తీక్ పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ అంతా దెబ్బతినడంతో మద్యానికి బానిసై, జిమ్ కు వెళ్లడం మానేశారు.

Advertisement

అదే ఆలోచనతో దారుణంగా తయారై పోయాడు. చివరికి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకాడలేదు అంటే ఆయనే పరిస్థితి ఏ విధంగా తయారయింది అర్థం చేసుకోవచ్చు. ఈ టైం లోనే తాను జిమ్కు వెళ్లే ట్రైనర్ ఇంటికి వచ్చి దినేష్ తో మాట్లాడి జరిగింది ఎలాగో జరిగిపోయింది. దీంతో జీవితం ఆగిపోదు కదా, తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించు అంటూ ఆయనకు మంచి మాటలు చెప్పాడు. దీంతో దినేష్ మళ్లీ జిమ్ము కు రావడం మొదలు పెట్టాడు. ఈ సందర్భంలోనే ప్రముఖ శ్వస్ క్రీడాకారిణి దీపిక పల్లికల్ కూడా అదే జిమ్ కు వస్తుండేది. కార్తీక్ పరిస్థితి తెలిసి ఆ ట్రైలర్ తో కలిసి దినేష్ కార్తీక్ ను మార్చడం కోసం తన వంతుగా కృషి చేసింది. అలా ఆమె మాటలతో పూర్తిగా మార్పు మొదలైంది. క్రికెట్ ప్రాక్టీస్ మొదలు పెట్టారు. దీపిక సహకారంతో మళ్ళీ దేశవాళీ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈ సమయంలోనే మురళి ఆటపై పట్టు కోల్పోయారు. దీంతో ఆయన్ను ఇండియన్ మరియు తమిళనాడు టీం నుంచి తీసేసారు. ఈ క్రమంలోనే దినేష్ మరియు దీపిక పెళ్లి చేసుకున్నారు.

ఇద్దరూ తన ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీ అయిపోయారు. కవలలు జన్మించారు. ఆ తర్వాత దీపిక శ్వస్ ఛాంపియన్ అయింది. మళ్లీ దినేష్ కార్తీక్ తమిళనాడు జట్టుకి సెలక్ట్ అయ్యారు. ఐపీఎల్ లో కి ప్రవేశించి అద్భుతంగా రాణించి కోల్కత్తా టీమ్ కూడా కెప్టెన్ అయ్యారు. ఆ తర్వాత 2022 ఐపీఎల్ మెగా వేలంలో బెంగళూరు ఇతన్ని కొనుగోలు చేసింది. ఈ విధంగా బెంగళూరు టీంలో ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. తన స్నేహితుడు మరియు భార్య చేసిన మోసానికి మరణం వరకు వెళ్లి నటువంటి దినేష్ మళ్లీ బ్యాక్ అయి తన జీవితంలో ఏ విధంగా సక్సెస్ అయ్యారో అర్థమైంది అనుకుంటా. దినేష్ జీవితం ప్రపంచంలోని ఎంతో మంది క్రీడాకారులకు పూర్తిగా నిలుస్తుంది.

Also read:  మ‌హానాడు గురించి జ‌న‌సేన అధినేత ఆరా.. అందుకోస‌మేనా..?

స్టేజీపై పూర్ణ‌తో ఆ జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ ఏమి చేసాడో తెలుసా..?

 

 

Visitors Are Also Reading