Home » రాజమౌళి సినిమాలో విలన్ గా తమిళ్ హీరో..!

రాజమౌళి సినిమాలో విలన్ గా తమిళ్ హీరో..!

by Azhar
Ad
ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో ఫ్యాన్స్ ముందుకు వచ్చిన దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత కొత్త సినిమా అనేది సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్నాడు అనేది తెలిసిందే. అయితే ఈ సినిమా అనేది ఇంకా ప్రారంభమ కాలేదు కానీ.. ఈ సినిమాపై రోజు ఓ చర్చ అనేది జరగుతుంది. ఇక ఈ సినిమాను రాజమౌళి.. దేశ వ్యాప్తంగా కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నాడు అనేది తెలిసిందే.
అయితే ఇప్పటికే ఈ సినిమాలో నటి నటులు ఎవరు అనే విషయంలో రాజమౌళి మునిగిపోయాడు. ఇక హాలీవుడ్ లో కూడా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో అక్కడి నటులు కూడా ఉండేలా రాజమౌళి చూసుకుంటున్నాడు. అందుకే థోర్ పాత్రలో భారత అభిమానులకు అలాగే ప్రపంచ సినీ అభిమానులకు ఎంతో దగ్గర అయిన క్రిస్ హెమ్స్‌వర్త్ ను కూడా ఈ సినిమాలోకి తేవాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా గురించి మరో వార్త అనేది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదే ఈ సినిమాలో విలన్ గురించి. ఈ రాజమౌళి సినిమాలో మహేష్ బాబుకు ప్రతి నాయకుడిగా తమిళ సూపర్ స్టార్ హీరో అయిన కార్తీ నటించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇక ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియదు కానీ.. ఈ వార్తలు నిజమే అయితే కార్తీ బంపర్ ఆఫర్ కొట్టినట్లే అంటున్నారు జనాలు.

Advertisement

Visitors Are Also Reading