కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని సర్వే సంస్థలు చెబుతున్నాయి. మే 10వ తేదీన కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రాజకీయపార్టీకి సంపూర్ణ మెజార్టీరాదని పీపుల్స్‌పల్స్ ప్రీపోల్ సర్వేలో వెల్లడించాయి. కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఏర్పాటు కానుందని… కాంగ్రెస్‌పార్టీకి 98, బిజెపికి 92, జెడిఎస్‌కు 27 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు పీపుల్స్‌పల్స్ ప్రీపోల్ సర్వేలో తేల్చాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి 95 – 105, బిజెపికి 90`100, జెడిఎస్‌క 25-30, ఇతరులు 1-2 స్థానాలు గెలుపొందే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ ప్రీపోల్‌సర్వేలో వెల్లడించాయి.
READ ALSO : Pushpa 2 : పుష్ప 2 లోనూ సమంత ఐటెం సాంగ్ ?
Advertisement
READ ALSO : IPL 2023 : ఏమైంది సూర్య…ఎందుకు ఇలా ఆడుతున్నావ్?
Advertisement
కర్ణాటకలో ప్రీపోల్ సర్వేను పీపుల్స్‌పల్స్ సంస్థ – సౌత్‌ఫస్ట్ అనే ఇంగ్లీష్ వెబ్‌సైట్ కోసం నిర్వహించింది. 25 మార్చ్ నుండి 10 ఏప్రిల్ 2023 వరకు 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5600 శాంపిల్స్‌తో పీపుల్స్‌పల్స్ సంస్థ ప్రీపోల్ సర్వే నిర్వహించింది. కాంగ్రెస్‌పార్టీకి 41 శాతం, బిజెపికి 36 శాతం, జెడిఎస్‌కు 16 శాతం, ఇతరులకు 7 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు పీపుల్స్‌పల్స్ పేర్కొంది. అలాగే.. కర్ణాటక రాష్ట్రానికి సిద్ధిరామయ్య ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని 32 శాతం, 25 శాతం యడ్డ్యూరప్ప, 20 శాతం బసవరాజ బొమ్మై , 18 శాతం కుమారస్వామి, 5 శాతం డి.కె.శివకుమార్‌ను కోరుకుంటున్నారని పేర్కొంది పీపుల్స్ పల్స్.
కర్ణాటక రాష్ట్రం అభివృద్ధి కాంగ్రెస్‌పార్టీతో సాధ్యమని 42 శాతం మంది, 38 శాతం మంది బిజెపి, 14 శాతం మంది జెడిఎస్ అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని వివరించింది. ఏ పార్టీకి మెజార్టీ రానిపక్షంలో కాంగ్రెస్`జెడిఎస్ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని 46 శాతం, బిజెపి-జెడిఎస్ 41 శాతం, కాంగ్రెస్-జెడిఎస్-ఇతరులు 6 శాతం, బిజెపి-జెడిఎస్-ఇతరులు 7 శాతం మంది కోరుకున్నారని తెలిపింది పీపుల్స్‌పల్స్.
READ ALSO : భర్త ఇంట్లో లేని సమయంలో…. భార్యలు చేయకూడని తప్పులు ఇవే!