Home » Pushpa 2 : పుష్ప 2 లోనూ సమంత ఐటెం సాంగ్ ?

Pushpa 2 : పుష్ప 2 లోనూ సమంత ఐటెం సాంగ్ ?

by Bunty
Ad

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ స‌మంత గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ స‌మంత తాజాగా శాకుంతలం సినిమాలో హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల కు సిద్దంగా ఉంది. సినిమా విడుద‌ల నేప‌థ్యంలో స‌మంత చిత్ర యూనిట్ తో క‌లిసి సినిమా ప్ర‌మోష‌న్స్ లో ఫుల్ బిజీగా ఉంది. కాగా సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ప‌లు టీవీ ఇంట‌ర్వ్యూల‌లో స‌మంత చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

READ ALSO : భర్త ఇంట్లో లేని సమయంలో…. భార్యలు చేయకూడని తప్పులు ఇవే!

Advertisement

తాజాగా ఓ ఇంటర్వ్యూలో “పుష్ప 2” చిత్రంలో ఐటమ్ సాంగ్ గురించి క్లారిటీ ఇచ్చింది. అల్లు అర్జున్ హీరోగా… స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీలో అల్లు అర్జున్ నటన ఎంత మందిని ఆకట్టుకుందో… అంతకుమించి సమంత డాన్స్ కూడా అందరినీ అట్రాక్ట్ చేసింది.

Advertisement

READ ALSO : IPL 2023 : ఏమైంది సూర్య…ఎందుకు ఇలా ఆడుతున్నావ్?

Samantha Ruth Prabhu's Item Song From Pushpa Crosses 100 Million Views

ఒకే ఒక ఐటమ్ సాంగ్ తో అప్పటివరకు చేసిన పాత్రలన్నీ మరిచిపోయేట్టు చేసిన సమంత మల్లి పుష్ప 2 చిత్రంలో అదిరిపోయే ఐటమ్ సాంగ్ లో చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంతకి ఇదే ప్రశ్న ఎదురైంది. దీంతో పుష్ప 2లో తాను ఐటమ్ సాంగ్ చేయడం లేదని స్పష్టం చేసింది. “మీరు అడుగుతున్నది జరగదు. నేను ఎలాంటి ఐటమ్ సాంగ్ చేయట్లేదు” అని క్లారిటీ ఇచ్చింది సమంత.

READ ALSO : హార్ట్ ఎటాక్ వస్తే… CPR ఎలా చేయాలి? ఇవే నియమాలు కచ్చితంగా తెలుసుకోండి.

Visitors Are Also Reading