Telugu News » Blog » “కాంతార2″అలా ఉండబోతుంది..షాకింగ్ విషయాలు బయటపెట్టిన రిషబ్ శెట్టి..!!

“కాంతార2″అలా ఉండబోతుంది..షాకింగ్ విషయాలు బయటపెట్టిన రిషబ్ శెట్టి..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

గత సంవత్సరం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై సంచలనాలు సృష్టించిన మూవీ ఏదైనా ఉంది అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది కాంతారా.. హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ అనేక సంచలనాలు సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సాధించింది. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. విడుదలైన ప్రతి భాషలో సూపర్ హిట్ గా నిలిచింది.

Advertisement

Advertisement

అంతేకాకుండా ఆస్కార్ నామినేషన్లలో కూడా చోటు సంపాదించుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా పార్ట్ 2 తెరకేక్కబోతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ చిత్రం కాంతారా2కు సీక్వెల్ కాదని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటన చేసింది. అయితే కాంతారా2 ప్రకటించి నెలలు గడుస్తున్న ఇప్పటికీ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా ఈ సినిమాపై హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి కీలక విషయాన్ని బయట పెట్టారు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది కాంతారా2 విడుదల చేస్తాం..

ఇప్పటికే సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాం. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఇది కాంతారా మూవీకి సీక్వెల్ కాదని, ఫ్రీక్వెల్.. మొదటి భాగం కథ ఎక్కడైతే ప్రారంభమైందో.. దానికి ముందున్న సంఘటనలను ఇందులో చూపించబోతున్నామని అన్నారు. అలాగే పంజర్లకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు పార్ట్ 2 లో ఎక్కువగా కనిపిస్తాయంటూ రిషబ్ చెప్పుకొచ్చారు.

Advertisement

also read:అతడికి 85 ఆమెకి 24.. ఆమెను తల్లిని చేయడమే ఆ వృద్ధుడి లక్ష్యమట..!!