గతకొద్దిరోజులుగా ఒకప్పుటి నటుడు కాంతారావుకు సంబంధించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాంతారావు కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆర్థికసమస్యలతో ఇబ్బంది పడుటుండటంతో ఒకప్పుడు ఇండస్ట్రీలో వెలుగు వెలిగిన కాంతారావు కుటుంబం ఇలాంటి పరిస్థితిల్లో ఉందా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాంతారావు ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ల రేంజ్ లో గుర్తింపు సాధించుకున్నారు.
Advertisement
అయితే కాంతారావు సినిమాలను కూడా నిర్మించారు. సొంతంగా తనే నిర్మాణ సంస్థను ప్రారంభించి సినిమాలను నిర్మించారు. కానీ ఆ సినిమాలు ఆడకపోవడంతో నష్టాలు వచ్చాయి. దాంతో కాంతారావు ఆర్థికఇబ్బందుల్లో పడ్డారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాంతారావు కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురవ్వడానికి కారణాన్ని ఆయన కూతురు వెల్లడించారు.
Advertisement
కాంతారావు కూతురు మాట్లాడుతూ…మా నాన్న చిన్న తనంలోనే వాళ్ల నాన్న చనిపోయారు. దాంతో వాళ్ల అమ్మ చాలా గారాబంగా పెంచింది. ఆయన ఏది చేస్తానంటే అదే చేసేవారు. చాలా మొండిగా ప్రవర్తించేవారు. ఎన్టీఆర్ వద్దని చెప్పినా మానాన్న సినిమాలు నిర్మించారు.
కానీ నష్టపోయిన తరవాత ఆయన మాట వినిఉంటే బాగుండని బాధపడ్డారు. నా పెళ్లికి కృష్ణగారు సాయం చేశారు. అంతే కాకుండా తాను ఏ సినిమా చేసినా అందులో నాన్నకు వేషం ఇప్పిస్తానని చెప్పారు. నాన్నకు నటన అంటే చాలా ఇష్టం…చివరివరకూ నటిస్తూనే ఉన్నారు. మా కోసం ఏమీ మిగిల్చలేదని ఎప్పుడూ బాధపడలేదు. అంటూ కాంతారావు కూతురు తండ్రి గురించి వెల్లడించారు.
Also Read:
- కొడుకులు, కూతుళ్లు, మనవరాళ్లకి ప్రత్యేకమైన పేర్లు పెట్టిన ఎన్టీఆర్.. దీని వెనుక ఇంత కథ ఉందా ?
- నన్ను అల్లరి చేస్తున్నారు…పోలీసులను ఆశ్రయించిన పవిత్రా లోకేష్..!