Home » న‌న్ను అల్ల‌రి చేస్తున్నారు…పోలీసుల‌ను ఆశ్ర‌యించిన ప‌విత్రా లోకేష్..!

న‌న్ను అల్ల‌రి చేస్తున్నారు…పోలీసుల‌ను ఆశ్ర‌యించిన ప‌విత్రా లోకేష్..!

by AJAY
Ad

నటుడు వికె నరేష్ న‌టి పవిత్ర లోకేష్ ల పేర్లు కొద్ది రోజులుగా వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. పవిత్ర లోకేష్ నరేష్ ఇద్దరు డేటింగ్ చేస్తున్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా నరేష్ మూడో భార్య పవిత్ర లోకేష్ ..నరేష్ లను ఓ హోటల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని వివాదానికి దిగారు. దానికి సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Advertisement

అంతేకాకుండా నరేష్ పవిత్ర లోకేష్ కలిసి ఓ స్వామిజీ వద్దకు వెళ్లిన వీడియో సైతం నెట్టింట చెక్కర్లు కొట్టింది. ఇక రీసెంట్ గా కృష్ణ మరణించిన తర్వాత నరేష్ పవిత్ర లోకేష్ తో కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. అంత్యక్రియలకు సైతం న‌రేష్ పవిత్ర లోకేష్ తో కలిసి వచ్చారు. దాంతో మొద‌టినుండి నెటిజన్లు వీరిద్ద‌రినీ ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

ఈ వయసులో పవిత్ర లోకేష్ నరేష్ డేటింగ్ చేయడం ఏంటి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అంతేకాకుండా మూడు పెళ్లిళ్లు అయిన నరేష్ పెళ్లి అయిన పవిత్ర లోకేష్ తో రిలేషన్షిప్ లో ఉండటం ఏంటి అంటూ దారుణంగా ట్రోల్ చేశారు. అయితే ఇప్పటివరకు ఈ జంట సైలెంట్ గానే ఉంది. కానీ తాజాగా పవిత్ర లోకేష్ పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ ఆపాలంటూ పవిత్ర లోకేష్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

తనను అల్లరి చేస్తున్నారని నరేష్ పేరును లాగి తన పరువుకు నష్టం కలిగిస్తున్నారని పవిత్ర లోకేష్ ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తన మార్ఫింగ్ ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారని పైకి చెప్పుకోలేని మాటలను అంటున్నారని పవిత్ర లోకేష్ ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా కొన్ని ఫేక్ ఖాతాల స్క్రీన్ షాట్ లు.. యూట్యూబ్ ఛానల్స్ వివరాలను పోలీసులకు ఇచ్చినట్టు సమాచారం.

Visitors Are Also Reading