Telugu News » Blog » మీ జీవితంలోని విల‌న్ లను క‌మెడియ‌న్ లుగా మార్చేయండి…కంగ‌నా షాకింగ్ కామెంట్స్..!

మీ జీవితంలోని విల‌న్ లను క‌మెడియ‌న్ లుగా మార్చేయండి…కంగ‌నా షాకింగ్ కామెంట్స్..!

by AJAY
Ads

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా రనౌత్ సినిమాల‌తో పాటూ త‌ర‌చూ రాజ‌కీయ‌, సాంఘీక అంశాల‌పై స్పందిస్తూ వివాదాల్లో నిలుస్తూ ఉంటుంది. దాంతో కంగనాల‌ను అభిమానించేవారితో పాటూ ద్వేశించేవాళ్లు కూడా ఉన్నారు. కంగ‌నాకు ప‌ద్మ అవార్డు ఇవ్వ‌డం పై కూడా విమర్శ‌లు వ‌చ్చాయి. కంగ‌నా బీజేపీకి అనుకూలంగా ఉండ‌టం వ‌ల్ల‌నే అవార్డు ఇచ్చార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇదిలా ఉండ‌గా కంగ‌నా మ‌హిళ‌లు స్ట్రాంగ్ గా ఉండాలంటూ ఎప్పుడూ చెబుతూ ఉంటారు.

kangana

kangana

తాజాగా కంగ‌నా ర‌నౌత్ మ‌హిళ‌లు త‌మ వంతు వ‌చ్చేవ‌ర‌కూ వెయిట్ చేయ‌కుండా వారే దాన్ని స్వ‌యంగా సాధించాల‌ని పేర్కొంది. ఈ మేర‌కు కంగ‌నా గ‌తంలో కామెంట్స్ చేసిన ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో అవ‌మానాలు, అస‌మాన‌త‌లు, వైఫ‌ల్యాలు, అనుచిత ప్ర‌వ‌ర్త‌న లాంటి భావోద్వేగాల‌ను ఉప‌యోగించడం నాకు న‌చ్చ‌దు. ఇలాంటి అనుభ‌వాల‌తో ల‌క్ష్యాల‌ను, సామ‌ర్ద్యాల‌ను పెంచుకునేందుకు వినియోగించుకోవాలి అంటూ పేర్కొంది. మిమ్మ‌ల్ని అభిమానించ‌లేని వారి కళ్ల నుండి చూడ‌కండి.

kangana

kangana

వారి విమ‌ర్శ‌ల‌ను మీరు ఎద‌గ‌డానికి మీరు ఉప‌యోగించుకోండి. మీరు జీవితంలో ఎదుగుతున్న క్ర‌మంలో వారిని చూసి ఆనందించడం మ‌ర్చిపోవ‌ద్దు. మీ జీవితంలో ఎవ‌రు విల‌న్లు గా ఉండాల‌ని అనుకుంటారో వారిని విలన్లుగా మార్చేయండి. అంటూ కంగ‌నా ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. ఇక కంగనా వీడియోలో చేసిన కామెంట్ల‌కు కొద‌రు శ‌భాష్ చాలా బాగా చెప్పావ్ కంగ‌నా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


You may also like