Home » ఆ టైం లో ఈ జీవితాన్ని వద్దనుకున్నా.. కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్..!

ఆ టైం లో ఈ జీవితాన్ని వద్దనుకున్నా.. కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్..!

by Sravya
Ad

హీరో కమల్ హాసన్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తన యాక్టింగ్ తో ఇంప్రెస్ చేస్తూ ఉంటారు. ఎలాంటి రోల్ అయినా కూడా కమల్ హాసన్ చాలా చక్కగా చేస్తూ ఉంటారు. విక్రమ్ సినిమా ఆయనకి మంచి హిట్ ని తీసుకువచ్చింది. కమల్ హాసన్ కెరియర్ లో చాలా కష్టాలు వున్నాయన్న విషయం చాలామందికి తెలియదు. ఒకానొక సమయంలో కమల్ హాసన్ సూసై** చేసుకోవాలని కూడా అనుకున్నారు. 21 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు కమల్ హాసన్ ఆత్మ**త్య చేసుకోవాలనుకున్నారు.

Advertisement

Advertisement

ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు రావట్లేదని గుర్తింపు రావట్లేదని ఫీల్ అయ్యి ఆ నిర్ణయం తీసుకోవాలని అనుకున్నట్లు చెప్పారు. అయితే ఒకవేళ ఆత్మ*త్య చేసుకుంటే ప్రతిభ ఉన్న కళాకారుడిని కోల్పోయామని ఇండస్ట్రీ ఫీల్ అవుతుందని ఆయన అన్నారు. ఆయన గురువు అనంత్ కి కూడా అదే విషయం చెప్పానని కమల్ హాసన్ చెప్పారు. ఆ టైంలో గురువుగారు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో సరైన సమయంలో గుర్తింపు అదే వస్తుంది అని ఆయనకి చెప్పారట. అయితే ప్రాణం తీసుకోవడం మంచి నిర్ణయం కాదని… ఆయనకి అనిపించి ఆ టైంలో ఆవేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు కమల్ హసన్. ప్రస్తుతం సోషల్ మీడియాలో కమల్ హాసన్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.

Also read:

Visitors Are Also Reading