Home » తీవ్ర అస్వ‌స్థ‌త‌తో ఆస్ప‌త్రిలో చేరిన క‌మ‌ల్…ఏమైదంటే..?

తీవ్ర అస్వ‌స్థ‌త‌తో ఆస్ప‌త్రిలో చేరిన క‌మ‌ల్…ఏమైదంటే..?

by AJAY
Ad

తమిళ స్టార్ హీరో విలక్షణ నటుడు కమల్ హాసన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్నటి నుండి కమల్ హాసన్ తీవ్ర‌మైన జ్వ‌రంతో పాటూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. దాంతో ఆయనను కుటుంబ సభ్యులు చెన్నై పోరూరు రామచంద్ర ఆస్పత్రిలో చేర్పించినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం కమల్ హాసన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అన్నదానిపై డాక్టర్లు అప్డేట్ ఇవ్వాల్సి ఉంది. తమ అభిమాన హీరో అస్వస్థతకు గురవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

ఇదిలా ఉండగా చాలా కాలం నుండి కమల్ హాసన్ సరైన హిట్ లేక స‌త‌మతం అవుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవల విక్రమ్ సినిమాతో కమలహాసన్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా కు కలెక్షన్ల వర్షం కురిసింది. కమల్ హాసన్ తమిళ హీరో అయినప్పటికీ టాలీవుడ్ లో సైతం ఆయనకు అభిమానులు ఉన్నారు. స్వాతిముత్యం సినిమాతో కమల్ టాలీవుడ్ లో ఫాన్స్ ను సంపాదించుకున్నారు.

Advertisement

Kamal hasan

Kamal hasan

ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌లో నటించారు. అంతేకాకుండా దశావతారం సినిమాలో పది అవతారాలతో అద్భుతమైన నటనతో ఆశ్చర్యపరిచారు. ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికీ నటుడిగా మాత్రం కమల్ హాసన్ కు గొప్ప పేరు ఉంది. రీసెంట్ గా క‌మ‌ల్ ద‌ర్శ‌కుడు క‌లాత‌ప‌స్వి కే విశ్వ‌నాథ్ ను క‌లిసిన వీడియోలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. ఇక క‌మ‌ల్ అస్వ‌స్త‌త‌కు గుర‌వ‌డంతో ఆయ‌న‌ త్వరగా కోలుకుని రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Visitors Are Also Reading