Home » శ్రీ‌దేవిని పెళ్లి చేసుకోవాల్సిన క‌మ‌ల్ హాస‌న్.. ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా ?

శ్రీ‌దేవిని పెళ్లి చేసుకోవాల్సిన క‌మ‌ల్ హాస‌న్.. ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా ?

by Anji
Ad

భారతీయ సినీ ప్రియులకి పరిచయం చేయనక్కర్లేని పేరు శ్రీదేవి. 54 ఏళ్ల వయసులోని ఈ అతిలోకసుందరి అనంత లోకాలకు వెళ్లిపోయినా.. ఆమె సినీ ప్రేక్షకులకు అందించిన మధుర జ్ఞాపకాలు ఎన్నటికీ తరగనివి. బాలనటిగా వెండితెర ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా రాణించింది. శ్రీదేవి తెలుగు , తమిళ వంటి సినిమాల్లోనే కాదు హిందీ భాషల్లో వందల సినిమాల్లో నటించి మెప్పించారు. శ్రీదేవి 1963 ఆగస్టు 13న తమిళనాడులో జన్మించారు. శ్రీదేవి పేరు వినగానే అభిమానుల గుండెల్లో గులాబీలు పూస్తాయి. ప్రేక్షకులు కొన్నితేనె చుక్కలు కలిపి చేసిన భూలోక సౌందర్యం శ్రీదేవి అనిపిస్తుంది. మూడు తరాల హీరోల సరసన న‌టించిన హీరోయిన్ గా అలరించిన అందం శ్రీదేవి సొంతం.

Also Read :  రాజబాబు నుంచి సుకుమార్ వరకు ఉపాధ్యాయ వృత్తి నుంచి సినీ రంగంలోకి వచ్చిన ప్రముఖులు వీరే..!

Advertisement

Manam

ఒకప్పుడు సినీ ఇండస్ట్రీని ఏక ఛత్రాధిపత్యంగా ఏలారు. సీనియర్ ఎన్టీఆర్ తో సహా స్టార్ హీరోలు అందరితోనూ నటించారు. తమిళ చిత్రాలలో కెరీర్ మొదలుపెట్టిన శ్రీదేవి, ఆ తర్వాత సౌత్ ఇండియా తో పాటు అనేక భారతీయ భాషల్లో నటించి మెప్పించింది. ఆమె అందం చూస్తే రాళ్లు కూడా రాగాల గువ్వలవుతాయి.ఆ పరవాల పలుకులకు చిలుకలు కూడా ఆమె పాదాల చుట్టూ తిరుగుతాయి. వేటగాడు, బొబ్బిలి పులి, క్షణక్షణం, ప్రేమాభిషేకం, కంచుకాగడ, ఆఖరి పోరాటం, జగదేకవీరుడు అతిలోక సుందరీ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి అశేష ప్రేక్షకాదారణ పొందింది. శ్రీదేవి బోనికపూర్ ని చేసుకుని జాన్వి కపూర్, ఖుషి కపూర్ కి జన్మనిచ్చిన విషయం విధిత‌మే. వారు ప్రస్తుతం సినీ పరిశ్రమలో సత్తా చాటేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

Advertisement

Also Read : ఊర్వ‌శివో రాక్ష‌సివో సినిమా రివ్వ్యూ…అల్లు శిరీష్ హిట్ కొట్టాడా..?

Manam

అయితే శ్రీదేవి అసలు క‌మల్‌హాసన్ ని వివాహమాడాల్సిందట. ఆకలి రాజ్యం, వసంత కోకిల, ఒక రాధా ఇద్దరు కృష్ణులు వంటి సినిమాలు వీరి కాంబినేషన్లో రూపొంది మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. శ్రీదేవి కూడా తమిళ్ అమ్మాయే అన్న సంగతి తెలిసిందే. పైగా ఇద్దరూ స్టార్ స్టేటస్ ను అనుభవించేవారు. ఈ కారణాలతోనే అనుకుంటా ఆ రోజుల్లో శ్రీదేవిని పెళ్లి చేసుకోమని ఆమె తల్లి కమల్ హాసన్ ను అడిగారట. కానీ ఈ పెళ్లి ప్రపోసల్ ను కమల్ సున్నితంగా తిరస్కరించాడ‌ట. అందుకు ప్రధాన కారణం శ్రీదేవిని కమల్ సోదరిగా భావించే వారట. సినిమాల్లో వారి మధ్యలో లవ్ సీన్స్ ఉన్నప్పటికీ బయట మాత్రం శ్రీదేవిని ఆ భావంతో ఎప్పుడూ చూడలేదని ఆయన చెప్పారట. అలా కమలహాసన్ ని మిస్ చేసుకునే ఛాన్స్ శ్రీదేవి మిస్ చేసుకుంది.

Also Read : డిసెంబర్‏లో పెళ్లి పీటలెక్కబోతున్న హీరోయిన్ కియారా అద్వానీ.. వరుడు ఎవరో తెలుసా ?

 

Visitors Are Also Reading