Home » రాజబాబు నుంచి సుకుమార్ వరకు ఉపాధ్యాయ వృత్తి నుంచి సినీ రంగంలోకి వచ్చిన ప్రముఖులు వీరే..!

రాజబాబు నుంచి సుకుమార్ వరకు ఉపాధ్యాయ వృత్తి నుంచి సినీ రంగంలోకి వచ్చిన ప్రముఖులు వీరే..!

by Anji
Ad

చాలా మంది డాక్టర్ కాబోయి యాక్టర్ ను అయ్యాను అంటూ  నటీనటులు పలు ఇంటర్వ్యూలో చెబుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం వృత్తి రీత్యా బడి పంతుళ్లు అయినప్పటికీ సినిమా రంగం అంటే మోజుతో సినీ ఇండస్ట్రీలోనూ కొత్త పాటలు చెప్పాలన్న తపనతో ఉపాధ్యాయుడిగా ఉద్యోగానికి గుడ్ బై చెప్పారు. సినీ ఇండస్ట్రీ తలరాతనే మార్చేశారు. బోర్డు మీద అక్షరాలు రాయాల్సిన చేతులే సినిమా పాటలు రాశాయి. పవర్ ఫుల్ డైలాగులను కూడా పేల్చాయి. స్కూల్లో పాఠాలు భోదించాల్వాసిన వారే హీరోలకు నటనలో కొత్త ఓనమాలు నేర్పించారు. మెగా ఫోన్ ను పట్టుకొని డైరెక్షన్ చేశారు. బెత్తం పట్టుకొని మరీ విద్యార్థులను సరైన మార్గంలో నడిపించిన టీచరమ్మలే సినీ ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్లుగా మారిన వాళ్లు కూడా ఉన్నారు. తెరమీద నటనాభినయంతో ప్రేక్షకులకు ఆనందాన్ని కూడా పంచిపెట్టారు. ఆ సినీరంగ ఉపాధ్యాయుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సి. నారాయణ రెడ్డి :

Advertisement

manam News
తెలుగు కవి, సాహితీవేత్త, తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవ ఎనలేనిది. ఆయన పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణరెడ్డి. 1988లో ఆయన రచించిన విశ్వంభర కావ్యానికి ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సికింద్రాబాద్ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసిన సి.నారాయణరెడ్డి ఆ తరువాత నిజాం కళాశాలలోనూ అధ్యాపకుడిగా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేస్తూ.. అనేక ఉన్నత పదవులు, బహుమతులను అందుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ తర్వాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహితీకారుడు ఆయనే. తెలుగు చలనచిత్ర రంగంలో ఆయన రాసిన పాటలు ఎన్నో ప్రసిద్ధి చెందడమే కాకుండా ఇప్పటికీ అవి మానవజాతి పై ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నాయి.

కొంగర జగ్గయ్య :

Jaggaiah Manam News
మేఘ గంభీరమైన కంఠం కారణంగా నటుడు కొంగర జగ్గయ్య కంచు కంఠం జగ్గయ్యగా కళ వాచస్పతిగా పేరుపొందారు. భారత ప్రభుత్వం 1992లో ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డుతో ఆయనను సత్కరించింది. నటుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించిన జగ్గయ్య ఉపాధ్యాయ వృత్తి నుండే సినీ ఇండస్ట్రీకి వచ్చారు. డిగ్రీ పూర్తవగానే తెనాలి దగ్గర ఉన్న దుగ్గిరాలలో ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఆయన పనిచేశారు. అప్పుడు కూడా పాఠశాల పని పూర్తవ్వగానే.. రైల్లో బెజవాడకు వెళ్లి నాటకాల రిహార్సల్స్ చేయడం, నాటకాలు వేయడం చేస్తుండేవాడు. దుగ్గిరాల ఉన్నత పాఠశాలలో జమున ఆయన స్టూడెంట్. ఆమెతో ఢిల్లీ రాజ్య పథకం పతనం అనే నాటకంలో వేషం వేయించారు. జగ్గయ్య అలా ఉపాధ్యాయ వృత్తి నుంచి నటుడిగా మారి ఎన్నో పాత్రలలో నటించి నటుడిగా విశిష్ట స్థానాన్ని అందుకున్నారు.

రాజబాబు : 


ఓ తరాన్ని తన హాస్యంతో ఉర్రూతలూగించిన హాస్యనటుడు రాజబాబు. ఆయన స్ఫూర్తితో ఎందరో కమెడియన్స్ గా మారారు. తెలుగు వాకిళ్లలో రాజబాబు పండించిన హాస్యం తాలూకు నవ్వులు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అయితే రాజబాబు కూడా కొద్దిగా కాలం పాటు ఉపాధ్యాయ వృత్తిని అలరించిన వారే. నిడదవోలులో పాఠశాల చదువు చదువుతూనే బుర్రకథ నేర్చుకోవడానికి శ్రీ అచ్యుత రామయ్య గారి దగ్గర చేరారు. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ముగించి తెలుగు ఉపాధ్యాయునిగా కొంతకాలం పాటు ఆయన పనిచేశారు. ఆ తర్వాత ఆయన సినీ రంగం వైపు అడుగులు వేసి గొప్ప హాస్యనటుడిగా చెక్కుచెదరని స్థానాన్ని అందుకున్నారు.

భానుమతి 


దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు ఇలా పలు శాఖలలో అనుభవం ఉన్న బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య శాస్త్రీయ సంగీత కళాకారుడు. తండ్రి దగ్గర సంగీతం అభ్యసించిన ఆమె 13 ఏళ్ల వయసులోనే వరవిక్రయం అనే సినిమాతో బాలనాటిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి, ఎన్నో సినిమాలను నిర్మించి తనదంటూ ఒక ముద్రను.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందారు. MGR హయాంలో తమిళనాడు చెన్నై సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గా ఆమె బాధ్యతలను నిర్వహించారు.

శాంత కుమారి


శాంత కుమారి అసలు పేరు వెల్లాల సుబ్బమ్మ. 1936లో శశిరేఖ పరిణయం సినిమాతో నట జీవితం ప్రారంభించి వందకు పైగా సినిమాల్లో నటించారు. ఆమె తండ్రి పేరు వెల్లాల శ్రీనివాసరావు. ఆయనకు కళలంటే ఎంతో ఇష్టం. అందుకే.. కూతురైన సుబ్బమ్మకు కర్ణాటక సంగీతం వయోలిన్ నేర్పించారు. డి.కె పట్టమ్మాల్.. సుబ్బమ్మకు సహధ్యాయిని. 13 ఏళ్ల వయసులోనే సుబ్బమ్మ కర్ణాటక సంగీతంలో ఉత్తీర్ణురాలయింది. 15 ఏళ్ల వయసులో వయోలిన్ లో ఉత్తీర్ణురాలయింది. తర్వాత గురువుగారితో కలిసి దక్షిణ భారతదేశమంతా ఎన్నో కచేరీలు చేసింది. పదహారేళ్ల వయసులోనే విద్యోదయ స్కూల్లో ఆమె పిల్లలకు సంగీతం నేర్పి గురువుగా ఎందరినో తీర్చిదిద్దింది.

రాజ సులోచన

 Rajasulochana Manam News
ఉపాధ్యాయ వృత్తి నుంచి సినీరంగంలోకి వచ్చిన వారిలో అలనాటి తెలుగు సినిమా నటి, కూచిపూడి భరత నాట్య నర్తకి రాజ సులోచన.. 1953లో కన్నడ చిత్రం గుణసాగరి చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన రాజ్య సులోచన. దాదాపు అన్ని భాషలలోని అప్పటి అగ్ర నటులతో నటించారు. ఆమె సుమారు 275 చిత్రాలలో నటించారు. ఆమెకున్న గొప్పతనం ఏమిటంటే.. ఆమె నటించిన ప్రతి భాషలోనూ తన పాత్రకు స్వయంగా డైలాగ్స్ చెప్పుకునేవారు. 1963 లో ఆమె పుష్పాంజలి నృత్య కళాకేంద్రం అనే శాస్త్రీయ నృత్య పాఠశాల ప్రారంభించింది. అది ఇప్పటికీ నడుస్తున్నది. రమ్యకృష్ణ , భానుప్రియ వంటి వారు ఆమె శిష్యులే.

మోహన్ బాబు


టాలీవుడ్ లో కింగ్ గా పేరున్న మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు. సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకడిగా ఇప్పటికీ గుర్తింపు పొందుతున్న మోహన్ బాబు. నటుడిగా, నిర్మాతగా సినీ రంగంలో తనదైన ముద్రను చాటుకున్నారు. అయితే సినీ రంగంలోకి ప్రవేశించక ముందు కొంతకాలం పాటు ఆయన వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. సినీ రంగంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలను అనుభవించి ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నట్లుగా ఆయన చెబుతుంటారు. దర్శకరత్న దాసరి నారాయణరావు తనకి గురువుగా ఆయన చెప్పుకుంటారు.

శోభన

Advertisement

SHobhana Manam News
నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలు శోభన. 1980 లలో భారత దేశంలో ప్రతిభావంతులైన కళాకారిణులలో ఆమె కూడా ఒకరు. అందంలోనూ, నటనలోనే కాక నాట్యంలో కూడా అద్భుతంగా రాణించిన శోభన. 1994లో కళార్పణ అనే సంస్థకు అంకురార్పణ చేసింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం భారత నాట్యంలో శిక్షణ, భారతదేశం అంతటా నృత్యవార్షికోత్సవాలు నిర్వహించటం.

పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopalakrishn Manam News
పరిచయం అక్కరలేని పేరు పరుచూరి గోపాలకృష్ణ. రైటర్ గా ఎన్నో చిత్రాలకు తన సోదరుడితో కలిసి పనిచేశారు. సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. అయితే ఆయన సినీ రంగంలోకి రాకముందు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. పత్తేపురంలోని మూర్తిరాజు కళాశాలలో ఆయన లెక్చరర్ గా పనిచేశారు. నటుడు ఎమ్.ఎస్ నారాయణ కి గురువు, ఆ తర్వాత ఆయనకి సహోద్యోగి కూడా. విశేషం ఏమిటంటే.. ఎమ్మెస్ తన క్లాస్ మెట్ కళాప్రపూర్ణను ప్రేమిస్తే పరుచూరి దగ్గరుండి పెళ్ళి కూడా చేయించారు. కథ రచయితగా సినిమాలు విజయవంతం కావడంతో సినీ రంగంలోనే భవిష్యత్తుని నిర్ణయించుకొని ఉపాధ్యాయులుగా ఉద్యోగాన్ని వదిలేశారు. సినీ రంగంలో పనిచేసిన చిన్నాళ్లకు తిరిగి తల్లి కోరిక మీద పీహెచ్ డీ చేసి డాక్టరేట్ పట్టా పొందారు. ఆ క్రమంలోనే తెలుగు సినిమా సాహిత్యం కథ కథనం శిల్పం అనే సిద్ధాంత గ్రంధాన్ని ఆయన రచించారు. ఇప్పటికీ యూట్యూబ్ వేదికగా పరుచూరి పాఠాలు అంటూ సినిమా నిర్మాణానికి సంబంధించిన పాఠాలు చెబుతూ తన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తున్నారు.

బ్రహ్మానందం

Brahmi Manam News

 

ఈ పేరు వింటేనే ముఖంపై తెలియకుండానే చిరునవ్వు వికసిస్తుంది. అంతలా ప్రేక్షకులలో ఆనందాన్ని నింపిన బ్రహ్మానందం కూడా సినీ రంగంలోకి రాకముందు ఓ టీచరే. బ్రహ్మానందం భీమవరం డి.ఎన్ఆర్ ఇంటర్మీడియట్ కాలేజీలో ఇ డిగ్రీ పూర్తి చేశారు. గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో ఎమ్మే పట్టా పుచ్చుకున్నారు. అత్తిలిలో 9 సంవత్సరాలు లెక్చరర్ గా పనిచేశాక సినీరంగంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత ఆయన అంచలంచలుగా ఎదుగుతూ తనదైన మార్క్ తో హాస్యబ్రహ్మగా చెక్కుచెదరని స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు వస్తున్న కమెడియన్లకు కూడా ఆయనే స్ఫూర్తి, గురువు. అంటే ఎంతగా ఆయన ప్రభావం పరిశ్రమలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఎమ్. ఎస్. నారాయణ

Late MS Narayana to be seen in a cameo appearance in Nenorakam | Telugu Movie News - Times of India
తనదైన తరహా హాస్యంతో దాదాపు 17 సంవత్సరాల కెరీర్ లో 700 పైగా సినిమాల్లో నటించిన కమెడియన్ ఎమ్ఎస్ నారాయణ సినీ రంగంలోకి రాకముందు ఆయన కూడా టీచర్ గా పనిచేశారు. పశ్చిమగోదావరి జిల్లా కేజీఆర్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసి కళా రంగంపై ఉన్న ఆసక్తితో అధ్యాపకుడి పదవికి రాజీనామా చేశారు. మొదట సినీ రచయితగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి ఆ తర్వాత నటుడిగా, కమెడియన్ గా గుర్తింపును పొందారు. రచయితగా ఆయన ఎనిమిది చిత్రాలకు పని చేశారు.

తనికెళ్ల భరణి 

Manam News Tanikella

ఈయన మల్టీ టాలెంటేడ్ వ్యక్తి. నటుడిగా, దర్శకునిగా, గేయ రచయితగా ఇలా ప్రతి శాఖపై వ్యక్తుల్లో తనికెళ్ల భరణి ఒకరు. సినీ రంగానికి రాక ముందు ఉపాధ్యాయుడిగా చేయలేదు. అప్పట్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ట్యూషన్లు చెప్పేవాడినని.. పలుమార్లు ఆయన ఇంటర్వ్యూలలో చెప్పారు. మధు ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ ముఖాభినయం పై ఏడాది పాటు ఆయన క్లాసులు నిర్వహించారు.

జయప్రకాశ్ రెడ్డి  

Jaya Prakash Manam News

రాయలసీమ యాసలో డైలాగ్ చెప్పాలంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు జయప్రకాశ్ రెడ్డి. ఆయన చెప్పే డైలాగ్ లకు ప్రత్యేక అభిమానులే ఉంటారు. దాదాపు 300 పైగా సినిమాల్లో నటించిన జయప్రకాశ్ రెడ్డి.. ఎక్కువగా ప్రతినాయక హాస్యపాత్రులనే పోషించారు. సినీ రంగానికి రాకముందు అతను మాథ్స్ టీచర్ గా విధులు నిర్వహించారు. డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ తీసుకున్న ఆయన.. 1979 నుంచి 1981 వరకు నల్లగొండ జిల్లాలోని సెయింట్ ఆల్ఫోన్స్ హై స్కూల్లో మాథ్స్ టీచర్ గా పని చేశారు. వైపు సినిమా అవకాశాలు మరోవైపు టీచరుగా రెండిటిపై దృష్టి సాధించలేక ఉపాధ్యాయ వృత్తిరించి స్వచ్ఛంద పదవి విరమణ పొందారు.

Also Read :  పాపం: ఈ అందాల ముద్దుగుమ్మలకు ఇన్ని వ్యాధులు ఉన్నాయా..?

సుకుమార్

Manam News

Manam News

టాలీవుడ్ సినీ దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఆయన దర్శకుడుగా అడుగులు వేయకముందు మాక్స్ లెక్చరర్ గా కొంతకాలం పాటు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించారు. చదువుకునే సమయంలో కళాశాలలో లేకపోవడంతో సుమారు పది మైళ్ళ దూరం వెళ్లి వేరే అధ్యాపకుడి దగ్గర గణితం నేర్చుకున్నారంట. డిగ్రీ మొదటి సంవత్సరం వచ్చేసరికి ఆయనకు లెక్కల మీద మంచి పట్టు వచ్చింది. తానే జూనియర్లకు మాథ్స్ నేర్పించడం ప్రారంభించాడు. నెలకు 75 వేల జీతం. బాగా నిలదొక్కుకున్నప్పటికీ ఆయన మనసు మాత్రం సినిమాల వైపు లాగుతుండడంతో సినీ రంగం వైపు అడుగులు వేసి దర్శకుడుగా తనదైన ముద్రను వేసుకోగలిగారు.

Also Read :  జెట్టి సినిమా ట్రైల‌ర్ ను లాంచ్ చేసిన గోపిచంద్ మ‌లినేని…!

 

త్రివిక్రమ్ శ్రీనివాస్

Trivikram Srinivas

త్రివిక్రమ్ శ్రీనివాసులు అందరూ మాటల మాంత్రికుడు అనే పిలుస్తుంటారు. ముఖ్యంగా త్రివిక్రమ్ డైలాగులు ఎంతగానో ఆకట్టుకుంటాయి. సాహిత్యం పై అతనికి పట్టు ఉండడంతో.. రచయితగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఒక ఆ తర్వాత దర్శకుడుగా తనదైన ముద్ర వేసుకున్నాడు. హాస్యనటుడు సునీల్ త్రివిక్రము ఒకే కాలేజీలో చదువుకున్నారు. త్రివిక్రమ్ వెనక టీచర్ హిస్టరీనే లేదు కానీ ఆర్థిక సమస్యల వల్ల కెరీర్ ప్రారంభంలో నటుడు గౌతమ్ రాజు కుమారుడికి ట్యూషన్ చెప్పేవాడని ఓ సందర్భంలో చెప్పారు. ఇలా నటనపై ఉన్న ఫ్యాషన్ తో తమ ఉపాధ్యాయ వృత్తిని పక్కకు పెట్టి సినిమా రంగం వైపు అడుగులు వేశారు. ఇక్కడ సక్సెస్ఫుల్గా కెరీర్ని సాధించిన వారు ఉన్నారు అదేవిధంగా సినిమా రంగంలో ఇవ్వడం లేక మరల ఎన్ని తిరిగిన వారు కూడా ఉన్నారు. వారు ఏ రంగంలో ఉన్న సరే గురువుగా బాధ్యతలు చేపట్టిన వారే కావడం విశేషం.

Also Read :

 మహానటి సావిత్రికి చివరి రోజుల్లో ఎన్టీఆర్,ఏఎన్నార్ చిన్న సాయం కూడా చేయలేదా..కారణం..!!

 

Visitors Are Also Reading