Home » Kamal Haasan : సింగిల్ టేక్‌లోనే.. 10 నిమిషాల డైలాగ్ 14 భాష‌ల్లో..!

Kamal Haasan : సింగిల్ టేక్‌లోనే.. 10 నిమిషాల డైలాగ్ 14 భాష‌ల్లో..!

by Anji
Ad

క‌మ‌ల్ హాస‌న్ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మేలేదు. న‌ట‌న‌కు ప‌ర్యాయ‌ప‌దంలా క‌నిపించే ఈ లెజెండ‌రీ హీరోఏ పాత్ర‌లో అయినా ఇలాగే ఒదిగిపోతుంటాడు. క్యార‌క్ట‌ర్ల‌కు తగ్గ‌ట్టుగా ద‌శ‌వాతారాలు పోషించ‌డం, సంభాష‌ణ‌లు ప‌ల‌క‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. అందుకే ఆయ‌న‌ను లోక నాయ‌కుడు, యూనివ‌ర్స‌ల్ హీరో అని స్వీట్‌గా పిలుచుకుంటారు. ఇటీవ‌ల విక్ర‌మ్ సినిమాతో మ‌రోసారి త‌న స్టామినాను నిరూపించుకున్నారు ఈ హీరో.

Advertisement

ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఇండియ‌న్ 2లో సినిమా చేస్తున్నారు. గ‌తంలో వ‌చ్చిన సూప‌ర్ హిట్ మూవీ భార‌తీయుడికి సీక్వెల్‌గా తెర‌కెక్కుతుంది ఈ సినిమా. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ క్రేజీ సీక్వెల్ గురించి కోలీవుడ్ మీడియాలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. అది ఏంటంటే .. దాదాపు 10 నిమిషాల డైలాగ్‌ని క‌మ‌ల్ సింగ్ టేక్‌లో చెప్పార‌ట‌. అది కూడా ఏకంగా 14 భాష‌ల్లో క‌మ‌ల్ నాన్‌స్టాప్‌గా చెప్పిన ఈ డైలాగ్‌కు చిత్ర బృందం అంతా ఆశ్చ‌ర్యంలో మునిగిపోయార‌ట‌.

Advertisement

Also Read :  ఆస్కార్ రేసులో రామ్‌చ‌ర‌ణ్, ఎన్టీఆర్.. ఖుషీ అవుతోన్న అభిమానులు..!

క‌థ డిమాండ్ మేర‌కు ఇందులో హీరో క‌మ‌ల్ 14 భాష‌ల్లో మాట్లాడుతార‌ట‌. ఈ సినిమాకి ఈ డైలాగ్ మెయిన్ హైలెట్‌గా నిలుస్తుంద‌ని చిత్ర బృందం భావిస్తోంది. ఇక ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ర‌కుల్ ప్రీత్‌సింగ్,సిద్ధార్థ్‌, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, బాబీ సింహా కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుధ్ ర‌విచంద‌ర్ స్వ‌రాలు స‌మ‌కూర్చుతుండ‌గా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు కార‌ణాల వ‌ల్ల ఈ చిత్రం ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది. త్వ‌ర‌గా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌నే యోచ‌న‌లో ఉన్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

 Also Read : ఏడాది లోపే ప్రభాస్ అనుష్క ల పెళ్లి…? కృష్ణం రాజు సన్నిహితుడు క్లారిటీ..!

Visitors Are Also Reading