Home » బింబిసార‌లో ఎన్టీఆర్ న‌టిస్తున్నాడా..? క్లారిటీ ఇచ్చిన క‌ళ్యాణ్‌రామ్‌..!

బింబిసార‌లో ఎన్టీఆర్ న‌టిస్తున్నాడా..? క్లారిటీ ఇచ్చిన క‌ళ్యాణ్‌రామ్‌..!

by Anji
Ad

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టిస్తున్న సినిమా బింబిసార‌. చాలా రోజుల‌ త‌రువాత ‘118’ తో తిరిగి హిట్ ట్రాక్ లోకి వ‌చ్చాడు క‌ళ్యాణ్‌రామ్‌. ప్ర‌స్తుతం ఆయ‌న చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో బింబిసార ఒక‌టి. ఈ చిత్రానికి విశిష్ట్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన పోస్ట‌ర్లు నంద‌మూరి అభిమానుల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

Advertisement

క‌ళ్యాణ్‌రామ్ ఎప్పుడూ క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ల కంటే డిఫ‌రెంట్ కాన్సెప్ట్ ఉన్న చిత్రాల‌నే ఎక్కువ‌గా చేయ‌డానికి ఇష్ట‌ప‌డుతారు. ఈసారి బింబిసార‌తో పాన్ ఇండియా లెవెల్‌లో ఓ డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రంలో ముందుకొస్తున్నాడు. బింబిసార‌లో ఎన్టీఆర్ ఉండ‌బోతున్నారా లేదా అనేది ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. నంద‌మూరి ఫ్యామిలీ నుంచి ప‌లువురు హీరోలు ఇండ‌స్ట్రీలో ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌టివ‌ర‌కు ఏ హీరోలు పెద్ద‌గా క‌లిసి న‌టించ‌లేదు. ఈ ఈవెంట్‌లో స్టేష్ షేర్ చేసుకున్నారు. సినిమాలో స్క్రీన్ మాత్రం ఇంత‌వ‌ర‌కు షేర్ చేసుకోలేదు.

Advertisement


క‌ళ్యాణ్‌రామ్ మొద‌టిసారి త‌న కెరీర్ లో భారీ బ‌డ్జెట్ చిత్రంలో న‌టిస్తుండ‌డంతో దీనికి ఎన్టీఆర్ క్రేజ్ యాడ్ అయితే ఇక ఈ సినిమాకు అంచ‌నాలు భారీగా పెరిగిపోతాయ‌నుకోవ‌డంలో ఎలాంటి ఆశ్చ‌ర్యంలేదు. బింబిసారలో ఎన్టీఆర్ ఉంటాడా ఉండ‌డా అనే విష‌యంపై క‌ళ్యాణ్‌రామ్ క్లారిటీ ఇచ్చారు. వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో తెక్కెకుతున్న బింబిసార దాదాపు 4 భాగాలు ఉంటుంద‌ని ఏదో ఒక భాగంలో క‌చ్చితంగా ఎన్టీఆర్ ఉండ‌బోతాడ‌ని నంద‌మూరి అభిమానుల‌కు శుభ‌వార్త చెప్పారు. హైఎండ్ విజువ‌ల్స్ తెర‌కెక్కిస్తున్న బింబిసార ఆగ‌స్ట్ 05న థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వ్వ‌డానికి సిద్ధం అవుతోంది.


బింబిసార ఇది టైమ్ ట్రావెల్ నేప‌థ్యంలో న‌డిచే క‌థ కావ‌డంతో సైన్స్‌ను చ‌రిత్ర‌ను క‌లుపుకుంటూ న‌డుస్తోంది. క‌థ ప్ర‌కారం వ‌ర్త‌మానంలో గ‌తంలోనూ రెండు విభిన్న‌మైన పాత్ర‌ల్లో క‌ళ్యాణ్‌రామ్ క‌నిపించ‌నున్నాడు. బింబిసార‌గా ఆయ‌న లుక్ ఇప్ప‌టికే బ‌య‌టికి వ‌చ్చింది. పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌ల‌వుతున్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా క్యాథ‌రిన్‌, సంయుక్త మీన‌న్ న‌టిస్తున్నారు. పీరియాడిక్ సైన్స్ ఫిక్ష‌న్ జాన‌ర్‌లో వ‌స్తున్న ఈ చిత్రానికి కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఓ పుణ్య‌భూమి బార్బేరియ‌న్ కింగ్ బింబిసార‌గా క‌ళ్యాణ్ రామ్ ఇందులో క‌నిపించ‌నున్నారు.

Also Read : 

జబర్దస్త్ ఓ దరిద్రం అంటున్న కిరాక్ ఆర్పి…!

సినీ న‌టి సాయిప‌ల్ల‌వికి హైకోర్టులో షాక్‌..!

Visitors Are Also Reading