Home » జబర్దస్త్ ఓ దరిద్రం అంటున్న కిరాక్ ఆర్పి…!

జబర్దస్త్ ఓ దరిద్రం అంటున్న కిరాక్ ఆర్పి…!

by Azhar
Ad
జబర్దస్త్ అనే కార్యక్రమం ఎంతో మందికి జీవితం ఇచ్చింది. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్లు, నటులు టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. ఇక షో ద్వారా చాలా మంది పేరు, డబ్బు అనేది సంపాదించుకున్నారు. కానీ కొంతమంది కొన్ని కారణాల వల్ల జబర్దస్త్ నుండి బయటకు వెళ్లిపోయారు. ఇక అందులో కిరాక్ ఆర్పి కూడా ఒక్కడు. జబర్దస్త్ ద్వారా ప్రజలకు పరిచయమైనా కిరాక్ ఆర్పి.. ఆ షో జడ్జ్ నాగబాబుతోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన జబర్దస్ నుండి వెళ్లిపోయిన తర్వాత ఆ షోను వీడిన కిరాక్ ఆర్పి.. తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లారు. ఇప్పుడు కూడా ఆయన చేస్తున్న షోలోనే చేస్తున్నారు.
అదలా ఉంటె.. జబర్దస్త్ నుండి చాలా మంది బయటకు వచ్చారు. కానీ వారెవరు ఆ షో గురించి ఎక్కువ మాట్లాడలేదు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన కిరాక్ ఆర్పి జబర్దస్త్ అనేది ఓ దరిద్రం అని కామెంట్స్ చేసారు. జబర్దస్త్ లో కేవలం వ్యాపారం మాత్రమే చేస్తారు. అక్కడ ఎవరికీ ఎలా ఉన్న తమ షో గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ నాగబాబు గారు అలా కాదు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటారు. అన్నం పెడతారు అని కిరాక్ ఆర్పి చెప్పాడు. అలాగే ఆ షో యొక్క ప్రొడక్షన్ హౌస్ కంటే చెత్త ప్రొడక్షన్ హౌస్ నేను మరెక్కడ చూడలేదు అని కిరాక్ ఆర్పి పేర్కొన్నారు.
నేను జబర్దస్త్ వచ్చిన తర్వాత నన్ను చాలా మంది తప్పుబట్టారు. కానీ ఇప్పుడు చెప్తున్నా.. నాకు అసలు ఆ జబర్దస్త్ అంటేనే ఇష్టం లేదు. అందుకు కారణం అక్కడి ప్రొడక్షన్ హౌస్. అక్కడ ఓ జైలులా అనిపిస్తుంది. ఇక అక్కడ పెట్టె ఫుడ్ అయితే జైలులో పెట్టేదానికంటే చాలా దరిద్రంగా ఉంటుంది. ఈ విషయంను మీరు జబర్దస్త్ నుండి బయటకు వచ్చిన ఎవరిని అడిగిన కూడా చెబుతారు అని కిరాక్ ఆర్పి పేర్కొన్నారు. ఇక కిరాక్ ఆర్పి చేసిన వ్యాఖ్యల పై ప్రజలలో కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తుంటే.. మరికొంతమంది మాత్రం నెగెటివ్ గా మాట్లాడుతున్నారు.

Advertisement

Visitors Are Also Reading