Home » సలార్ కి పోటీ గా వస్తున్న కళ్యాణ్ రామ్ డెవిల్.. కారణం అదేనా ?

సలార్ కి పోటీ గా వస్తున్న కళ్యాణ్ రామ్ డెవిల్.. కారణం అదేనా ?

by Anji
Ad

కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న డెవిల్ సినిమా ఈ నెలలోనే రిలీజ్ కి రెడీ అయింది. ఇక ఇదే క్రమంలో ఈ సినిమా పోటీగా ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అనే విషయం మీద చాలామందికి క్లారిటీ అయితే లేదు. సలార్ 22 వ తేదీన వస్తుంటే 29వ తేదీన డెవిల్ సినిమా వస్తుంది. అంటే దాదాపుగా ఒక వన్ వీక్ గ్యాప్ లో ఈ రెండు సినిమాలు రావడం అనేది విశేషం. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ అంటే డెవిల్ అనే ఒక కొత్త రకం సినిమాను చేసి మంచి గుర్తింపు పొందాలనే ఆశతో చాలా ఆసక్తితో ఉన్నాడు.

Advertisement

సలార్ సినిమా కనుక సక్సెస్ టాక్ తెచ్చుకుంటే డెవిల్ సినిమా పైన ఎఫెక్ట్ చాలా వరకు పడుతుందనే విషయం అయితే మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. డెవిల్ సినిమా కళ్యాణ్ రామ్ కెరియర్ లో మరో బింగిసారా లాంటి హిట్ అవుతుందని అతను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కానీ ఏ సినిమా ఎలా ఉన్నా కూడా రిలీజ్ అనేది కరెక్ట్ టైం లో చేయాలి అనేది చాలా రోజుల నుంచి వస్తున్న పద్ధతి. ఇప్పుడు స్టార్ హీరో అయినా ప్రభాస్ కి పోటీగా ఈ సినిమాను దింపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ ఇటు ప్రభాస్ అభిమానులు కానీ సినిమా అభిమానులు కానీ కళ్యాణ్ రామ్ మీద కొంతవరకు ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే కళ్యాణ్ రామ్ కి ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఎవరిని ఏమీ అనడు.ఆయనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ ఎవరితో విభేదాలు లేకుండా ముందుకు వెళుతూ ఉంటాడు. కాబట్టి కళ్యాణ్ రామ్ సినిమా కూడా సక్సెస్ అవ్వాలని ప్రతి ప్రేక్షకుడు కోరుకుంటాడు. కానీ సలార్ కి పోటీగా రావడం వల్ల భారీగా నష్టపోయే అవకాశం ఉంది అంటూ కూడా కళ్యాణ్ మీద ఉన్న ఇష్టాన్ని ఇలా రీవీల్ చేస్తున్నారు. సినిమా ఫ్లాప్ అవుతుందేమో అనే ఉద్దేశంలోనే అభిమానులు ఇలా తెలియజేస్తున్నారు.  ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సక్సెస్ సాధిస్తుంది అనేది వేచి చూడాలి మరి.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading