సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చిరంజీవి అల్లుడుగా కళ్యాణ్ దేవ్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ఎంతో కష్టపడుతున్నారని చెప్పకనే చెప్పవచ్చు.
Advertisement
ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీ ఈ హీరోకి సపోర్ట్ చేయడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూడా కళ్యాణ్ దేవ్‌తో విడిపోతున్నట్టు వార్తలు జోరు అందుకున్నాయి. వీరు కలిసి ఉండడం లేదని సమాచారం. ఈ తరుణంలో కళ్యాణ్ దేవ్ పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అయింది.
కళ్యాణ్ దేవ్, శ్రీజ దంపతులపై ఎన్ని రూమర్లు వినిపిస్తున్నప్పటికీ ఇరు కుటుంబాలు చాలా మౌనంగానే ఉంటున్నాయి. కానీ వీరిద్దరి మీద ఎటువంటి ప్రకటన చేయడం లేదు. ఇక సోషల్ మీడియాలో వీరి ఖాతాలను పరిశీలిస్తే మాత్రం వీరు విడివిడిగానే ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన పలు ఈవెంట్లు, సెలబ్రేషన్‌లలో కళ్యాణ్ దేవ్ ఎక్కడ కనిపించకపోవడం గమనార్హం. దీంతో మెగా ఫ్యామిలీ కళ్యాణ్ దేవ్‌ని పట్టించుకోవడం లేదన్నట్టుగా పలు వార్తలు వినిపిస్తున్నాయి. చివరగా సూపర్ మచ్చి, కిన్నరసాని వంటి సినిమాల్లో నటించినా ఆ సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. ఆ సినిమాలను మెగా ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ కూడా ప్రమోషన్ చేయలేదు.
Advertisement
తాజాగా కళ్యాణ్ దేవ్ తల్లి పుట్టిన రోజు సందర్భంగా ఓ పోస్ట్ చేశారు. జీవితం ఒక్కోసారి ఎంతో కష్టతరంగా మారుతుంది. కానీ నీ ప్రేమ వల్ల వచ్చే శక్తితో వాటిని ఎదుర్కుంటాననే నమ్మకం నాకు ఉంది. ఎల్లప్పుడూ నాకు నీ సపోర్టు నిలుస్తున్నందుకు థ్యాంక్యూ మా అంటూ కళ్యాణ్ తన తల్లిమీద ఉన్న ప్రేమను తెలియజేశారు. తాజాగా శ్రీజ కూతురు నివృతి పుట్టిన రోజు సందర్భంగా కళ్యాణ్ దేవ్ స్పందించలేదు. గత ఏడాది నివృతి పుట్టిన రోజు వేడుక సందర్భంగా స్పెషల్ పోస్ట్‌తో తెలియజేశారు. కానీ ఈ సంవత్సరం అసలు విషేస్ కూడా చెప్పకపోవడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది.
Also Read :
Sai Pallavi : ఆ లవ్ లెటర్ వల్లే మా పేరెంట్స్ నన్ను చావగొట్టారు..!!
ఎమ్మెల్యేగా హైపర్ ఆది.. అందుకే పవన్ ని కలిశాడా..?