Home » నీ వల్ల కాదన్న వాళ్ళకి నవ్వుతూ సమాధానం ఇవ్వు…విడాకుల వార్తల తరవాత కళ్యాణ్ దేవ్ మొదటి పోస్ట్ వైరల్..!

నీ వల్ల కాదన్న వాళ్ళకి నవ్వుతూ సమాధానం ఇవ్వు…విడాకుల వార్తల తరవాత కళ్యాణ్ దేవ్ మొదటి పోస్ట్ వైరల్..!

by AJAY
Ad

మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ తన భర్త కళ్యాణ్ తో విడాకులు తీసుకోబోతుంది అంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది కాలంగా శ్రీజ కళ్యాణ్ వేరువేరుగా ఉన్నట్లుగా టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని దాంతో శ్రీజ కళ్యాణ్ దేవ్ వేరువేరుగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ వార్తలకు బలం చేకూర్చేలా శ్రీజ ఇన్ స్టాగ్రామ్ లో గత ఏడాది కాలంగా కల్యాణ్ ఫోటోలను షేర్ చేయలేదు.

Advertisement

మరోవైపు రీసెంట్ గా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుండి కళ్యాణ్ దేవ్ అనే పేరును తొలగించి శ్రీజా కొణిదెల గా మార్చుకుంది. మరోవైపు కళ్యాణ్ దేవ్ వరస సినిమాలు చేస్తున్నప్పటికీ మెగా ఫ్యామిలీ నుండి ఎలాంటి సపోర్ట్ కనిపించడం లేదు. కళ్యాణ్ దేవ్ ఫస్ట్ సినిమాకు మెగా ఫ్యామిలీ ప్రమోషన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. కానీ రీసెంట్ గా సంక్రాంతికి కళ్యాణ్ హీరోగా నటించిన సూపర్ మచ్చి సినిమా విడుదల అయింది.

Advertisement

అయితే ఈ సినిమాకు మెగా ఫ్యామిలీ నుండి సపోర్ట్ చేసేందుకు ఒక్కరూ కూడా ముందుకు రాలేదు. దాంతో శ్రీజ కళ్యాణ్ విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే కొద్ది రోజులుగా వస్తున్న విడాకుల వార్తలపై అటు శ్రీజ ఇటు కళ్యాణ్ దేవ్ కానీ స్పందించలేదు. ఇదిలా ఉంటే రీసెంట్ గా కళ్యాణ్ దేవ్ ఇన్ స్టాగ్రామ్ లో చేసిన ఒక పోస్టు వైరల్ అవుతుంది.

SREEJA INTO BIGG BOSS OTT

ఈ పోస్ట్ లో కళ్యాణ్ దేవ్ … ప్రజలు నువ్వేమీ చేయలేమని చెబుతుంటారు. వాళ్ళని చూస్తూ నవ్వేసి నేను చేస్తా నువ్వు చూడు. అని చెప్పాలని పేర్కొన్నారు. ఇక మరో పోస్ట్ లో కళ్యాణ్ దేవ్ క్యాండిల్ ముందు కూర్చున్న ఫోటో పెట్టి ఈ ఫోటో జాగ్రత్తగా చూడండి. ఇందులో మీకు ఏం కనిపిస్తుంది అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఫోటోలో కళ్యాణ్ ఎడమ కన్నుకు గాయం అయినట్లు కనిపిస్తోంది.

Visitors Are Also Reading