Home » శ్రీ‌జ‌- క‌ళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకుంటున్నారా..? వారి లైప్‌లో ఓ ఆస‌క్తిక‌ర‌మైన ఘ‌ట‌న

శ్రీ‌జ‌- క‌ళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకుంటున్నారా..? వారి లైప్‌లో ఓ ఆస‌క్తిక‌ర‌మైన ఘ‌ట‌న

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీ‌జ గురించి అంద‌రికీ తెలిసిందే. శ్రీ‌జ గ‌తంలో పెద్ద‌వాళ్ల‌ను ఎదురించి ఓ వ్య‌క్తిని ప్రేమ వివాహం చేసుకుని విడాకులు ఇచ్చారు. త‌ద‌నంత‌రం క‌ళ్యాణ్ దేవ్ ని పెళ్లి చేసుకున్నారు. ప్ర‌స్తుతం శ్రీ‌జ‌-క‌ళ్యాణ్ దేవ్ దంప‌తులు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నారు. ముఖ్యంగా వారు విడిపోయార‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా క‌ళ్యాణ్ దేవ్ ని అన్ ఫాలో చేసింది. 6 నెల‌ల‌కు పైగా క‌ళ్యాణ్ దేవ్-శ్రీ‌జ విడివిడిగా ఉంటున్నారు. శ్రీ‌జ తండ్రి చిరంజీవి వ‌ద్ద‌నే ఉంటుంది. ఇక క‌ళ్యాన్ దేవ్ త‌న పేరెంట్స్ తో క‌లిసి ఉంటున్నారు. ఈ మ‌ధ్య కాలంలో జ‌రిగిన ఫ్యామిలీ వేడుక‌ల్లో వీరు క‌లిసి క‌నిపించ‌లేదు. శ్రీ‌జ పెద్ద కుమార్తె పుట్టిన రోజు వేడుక‌ల్లో క‌ళ్యాణ్ దేవ్ క‌నిపించ‌లేదు.

Advertisement

క‌ళ్యాణ్ దేవ్ త‌న త‌ల్లి పుట్టిన రోజు వేడుక జ‌ర‌ప‌గా శ్రీ‌జ హాజ‌రు కాలేదు. శ్రీ‌జ‌ను పెళ్లి చేసుకున్న త‌రువాత విజేత సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. యావ‌రేజ్‌టాక్‌తోనే న‌డిచింది. చిరంజీవి హిట్ చిత్రాల్లో ఒక‌టైన విజేత సినిమా టైటిట్‌తో రావ‌డం.. చిరంజీవి ప్ర‌చారం చేయ‌డంతో మెగా అభిమానులు ఆద‌రించారు. శ్రీ‌జ‌తో విబేధాల కార‌ణంగా క‌ళ్యాణ్ దేవ్ చేసిన రెండు చిత్రాల‌కు చిరంజీవి కుటుంబం నుంచి ఏ ఒక్క‌రూ మ‌ద్దతు ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. సూప‌ర్ మ‌చ్చి, ఓటీటీలో విడుద‌లైన‌ కిన్నెర‌సాని వంటి చిత్రాలు ఆక‌ట్టుకోలేక‌పోయాయి. ఇదిలా ఉండ‌గా.. చిరంజీవి కూతురు శ్రీ‌జ మూడో పెళ్లికి సిద్ధం అవుతున్న‌ట్టు వార్తలు వినిపిస్తున్నాయి. త‌న‌కు అత్యంత స‌న్నిహితుడు అయినా మిత్రుడిని శ్రీజ పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటున్న‌ట్టు స‌మాచారం. ఈ పెళ్లి ఇష్టం లేని చిరంజీవి కూడా కూతురు కోసం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌నే వాద‌న వినిపిస్తుంది.

Advertisement

ఈ నేప‌థ్యంలోనే ఓ అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. శ్రీ‌జ‌-క‌ళ్యాణ్ దేవ్ దంప‌తుల కూతురు న‌విష్క తండ్రి వ‌ద్ద‌కు వ‌చ్చింది. ఎడ‌బాటు త‌రువాత న‌విష్క త‌ల్లి శ్రీ‌జ వ‌ద్దే ఉంటున్న‌ట్టు తెలుస్తోంది. అక‌స్మాత్తుగా చిన్నారి తండ్రి క‌ళ్యాణ్ దేవ్ తో క‌నిపించ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. క‌ళ్యాణ్ దేవ్ త‌న ఇన్‌స్టాగ్రామ్ న‌విష్క తో ఆహ్లాదంగా గ‌డుపుతున్న వీడియో షేర్ చేశారు. ఇక దీంతో శ్రీ‌జ‌- క‌ళ్యాణ్ దేవ్ క‌లిసి పోయారనే సందేహాలు క‌లుగుతున్నాయి. విడాకులు తీసుకున్న‌ప్ప‌టికీ పిల్ల‌ల‌ను చూసుకునే బాధ్య‌త ఇద్ద‌రికీ ఉంటుంద‌ని.. కోర్టు అనుమ‌తి మేర‌కు కూతురు న‌విష్క‌ను క‌లిసే అవ‌కాశం క‌ళ్యాణ్ దేవ్ కి ద‌క్కి ఉండ‌వ‌చ్చు. ఇక ఈ వీడియోలో శ్రీజ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. వీరి విడాకుల గురించి ర‌క‌ర‌కాలుగా అనుకోవ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా శ్రీ‌జ‌-క‌ళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్నార‌ని ఆ విష‌యం అధికారికంగా ప్ర‌క‌టించ‌డానికి చిరంజీవి ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని టాక్ వినిపిస్తోంది.

Also Read : 

స‌మంత‌తో క‌లిసి నాగ‌చైత‌న్య న‌టిస్తారా..? దీనిపై ఆయ‌న ఏమ‌న్నారంటే..?

తొట్టెంపూడి వేణు బాలయ్యకు అంత దగ్గరి బందువా… వరసకు ఏమవుతాడు అంటే…?

Visitors Are Also Reading