Home » స‌మంత‌తో క‌లిసి నాగ‌చైత‌న్య న‌టిస్తారా..? దీనిపై ఆయ‌న ఏమ‌న్నారంటే..?

స‌మంత‌తో క‌లిసి నాగ‌చైత‌న్య న‌టిస్తారా..? దీనిపై ఆయ‌న ఏమ‌న్నారంటే..?

by Anji
Ad

టాలీవుడ్ సినీ ప్రేక్ష‌కుల‌కు నాగ‌చైత‌న్య పేరు చాలా ప‌రిచ‌య‌మే. ముఖ్యంగా నాగ‌చైత‌న్య, స‌మంత దంప‌తులు విడాకులు తీసుకుంటున్నార‌నే వార్త గ‌త ఏడాది సోష‌ల్ మీడియాలో ఎంత వైర‌ల్ అయిందో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. తాజాగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు నాగ‌చైత‌న్య‌. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ న‌టిస్తున్న లాల్‌సింగ్ చ‌డ్డా సినిమా ద్వారా రంగ ప్ర‌వేశం చేస్తున్నారు. ఇక ఈ చిత్ర ప్ర‌మోష‌న్‌లో నాగ‌చైత‌న్య బిజీగా ఉన్నాడు.


లాల్ సింగ్ చ‌డ్డా చిత్రంలో అమీర్ ఖాన్ స్నేహితుడి పాత్ర‌లో చైతూ న‌టిస్తున్నాడు. తాజాగా ఇంట‌ర్వ్యూలో చైతు మాట్లాడారు. ముఖ్యంగా త‌న ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ, సినిమా త‌దిత‌ర అంశాల‌పై చైతు చెప్పుకొచ్చాడు. అఖిల్‌, సుమంత్‌, రానా వీరంద‌రూ నా ఫ్యామిలీ. సినిమాల్లో న‌న్ను విమ‌ర్శించ‌డం, అభినందించ‌డం చేస్తుంటారు. నాకు ఫ్రెండ్స్ చాలా త‌క్కువ అని.. క్లోజ్ ఫ్రెండ్స్ ఐదారుగురు మాత్ర‌మే ఉన్నారు. ఎక్కువ మంది స్నేహితుల‌తో తిర‌గ‌డం లాంటివి నేను చేయ‌న‌ని చెప్పుకొచ్చాడు. ఇక సౌత్ సినిమాల గురించి స్పందిస్తూ.. సౌత్ సినిమాలు నార్త్ లో కూడా విడుద‌లై దేశ వ్యాప్తంగా గుర్తింపు పొంద‌డం శుభ‌ప‌రిణామం. ఏ చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి మంచి చిత్రం వ‌చ్చిన‌ప్పటికీ ఇండియ‌న్ సినిమాగానే భావించాలని పేర్కొన్నాడు. త‌న గురించి వ‌స్తున్న రూమ‌ర్స్ గురించి ప‌ట్టించుకోన‌ని చైతు క్లారిటీ ఇచ్చాడు.

Advertisement

Advertisement

తొలుత ఆలోచించే వాడిని కానీ ఇప్పుడు ఆ రూమ‌ర్స్ గురించి అంత‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని చెప్పుకొచ్చాడు. ఇక ఇంట‌ర్వ్యూలో యాంక‌ర్ స‌మంత గురించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న సంధించాడు. ఆన్ స్క్రీన్ పై స‌మంత‌తో మీ కెమిస్ట్రీకి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది క‌దా అడ‌గ్గా చైతు అవును అని స‌మాధానం చెప్పాడు. స‌మంత‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం ఉందా అని ప్ర‌శ్నించ‌గా.. చైతు ఒక్క‌సారిగా గ‌ట్టిగా న‌వ్వాడు. ఇక ఆ త‌రువాత ఒక‌వేళ అలా జ‌రిగితే చాలా క్రేజీగా ఉంటుందేమో.. అది జ‌రుగుతుందో లేదో కూడా నాకు మాత్రం తెలియ‌దు. ఈ ప్ర‌పంచానికే తెలియాలంటూ నాగ‌చైత‌న్య స‌మాధానం ఇచ్చాడు. నాగ చైత‌న్య‌కి రీసెంట్ గా థాంక్యూ రూపంలో గ‌ట్టి షాకే త‌గిలింది. ఇక నాగ‌చైత‌న్య అభిమానులు లాల్ సింగ్ చ‌డ్డా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read :

అరుంధతి సినిమా స్టోరీ ఎలా పుట్టిందంటే ? నిర్మాత శ్యామ్ ప్రసాద్ కి ఎదురైన ఆ సంఘటన …!

మీరు వాకింగ్ చేస్తున్నారా..? వాకింగ్ చేయ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలిస్తే మీరు చేయ‌కుండా ఉండ‌రు..!

 

Visitors Are Also Reading