Telugu News » మెగా ఫ్యామిలీకి దూరంగా శ్రీజ భర్త…అసలేం జరిగింది..?

మెగా ఫ్యామిలీకి దూరంగా శ్రీజ భర్త…అసలేం జరిగింది..?

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి వారసత్వంగా చాలామంది మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలా వచ్చిన వారిలో మెగాస్టార్ కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ కూడా ఒకరు. శ్రీజ తో వివాహం తర్వాత కళ్యాణ్ దేవ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. విజేత అనే సినిమాతో కల్యాణ్ దేవ్ చిత్రపరిశ్రమకు పరిచయమయ్యాడు. కానీ ఈ సినిమా అనుకున్న మేర విజయం సాధించలేకపోయింది. ఇక ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ కిన్నెరసాని, సూపర్ మచ్చి అనే సినిమాలలో నటిస్తున్నాడు. కళ్యాణ్ దేవ్ తండ్రి వ్యాపారవేత్త కాగా సినిమాలపై ఉన్న ఆసక్తితో కళ్యాణ్ మాత్రం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.

Kalyan dev

Kalyan dev

ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీ కి కళ్యాణ్ దేవ్ కొంతకాలంగా దూరంగా ఉంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫంక్షన్లలోనూ…. సినిమా ఫంక్షన్లలోనూ కళ్యాణ్ దేవ్ కనిపించకపోవడం కూడా అనుమానాలకు దారితీస్తోంది. అదేవిధంగా ఇదివరకు శ్రీజా సోషల్ మీడియాలో భర్త కళ్యాణ్ దేవ్ ఫోటోలను తరచూ షేర్ చేస్తూ ఉండేవారు. కానీ ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటివరకు శ్రీజ తన భర్త తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయకపోవడం కూడా అనుమానాలకు దారి తీస్తోంది.

Advertisement

Advertisement

also read : పోలీసులను ఆశ్రయించిన యాంకర్ రవి… తప్పు మాట్లాడాలి అంటే భయపడాలి అంటూ వారిపై కేసు…!

ఈ నేపథ్యంలోనే శ్రీజ కళ్యాణ్ దేవ్ మధ్య గ్యాప్ పెరిగిందా అన్న వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే కళ్యాణ్ దేవ్ మాత్రం శ్రీజ పుట్టిన రోజు సందర్భంగా ఆమెతో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసి దానికి లవ్ సింబల్ ను జత చేశాడు. దాంతో ఇద్దరి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని తేలిపోయింది. కానీ కుటుంబంలో గొడవల కారణంగా కళ్యాణ్ దేవ్ మెగా ఫ్యామిలీ కి దూరంగా ఉంటున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం మెగా ఫ్యామిలీ మెంబెర్స్ నోరు విప్పాల్సిందే.

Visitors Are Also Reading