Home » కాజల్ కొడుకు ఎంత అందంగా ఉన్నాడో చూసారా..!

కాజల్ కొడుకు ఎంత అందంగా ఉన్నాడో చూసారా..!

by AJAY
Ad

అందాల చందమామ కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. మగధీర సినిమాతో కాజల్ అగర్వాల్ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. అంతకు ముందు కాజల్ తేజ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించింది. ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంది. అయితే మగధీర లాంటి ఘన విజయం తర్వాత మాత్రం కాజల్ అగర్వాల్ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

Advertisement

Advertisement

ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరి సరసన కాజల్ సినిమాలు చేసింది. ఇక ఇటీవల కాలంలో కాజల్ సీనియర్ హీరోలతో సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి.. బాలకృష్ణ లతో సినిమాలు చేయడానికి కూడా కాజల్ రెడీ అంటోంది. మరోవైపు అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే రీసెంట్ గా కాజల్ అగర్వాల్ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇప్పటి వరకు కాజల్ తన కొడుకు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. కానీ తాజాగా కాజల్ తన కొడుకు కనిపించేలా ఫోటోను షేర్ చేసింది ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Visitors Are Also Reading