Home » ఎన్టీఆర్ కి డూప్‌గా ఎంట్రీ ఇచ్చిన కైకాల స‌త్య‌నారాయ‌ణ‌.. బెస్ట్ విల‌న్‌గా ఎద‌గడానికి ఏం చేశాడో తెలుసా..?

ఎన్టీఆర్ కి డూప్‌గా ఎంట్రీ ఇచ్చిన కైకాల స‌త్య‌నారాయ‌ణ‌.. బెస్ట్ విల‌న్‌గా ఎద‌గడానికి ఏం చేశాడో తెలుసా..?

by Anji
Published: Last Updated on
Ad

సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ గురించి ప్ర‌తి ఒక్క‌రికీ తెలిసిందే. ఆయ‌న న‌ట‌న ఓ ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి. ముఖ్యంగా ఎన్టీఆర్ సినిమాలో ఎక్కువ‌గా క‌నిపించే వారు స‌త్య‌నారాయ‌ణ‌. కైకాల స‌త్య‌నారాయ‌ణ తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దొరికిన ఓ గొప్ప న‌టుడు అనే చెప్పాలి. ఆయ‌న ఎలాంటి పాత్ర‌లోనైనా జీవించే న‌టుడు. క‌మెడియ‌న్ గా, విల‌న్ గా సెంటిమెంట్ పండించే న‌టుడిగా ఎన్నో సినిమాల్లో త‌న అద్బుత‌మైన పేరు సంపాదించుకున్నాడు.

Advertisement

తెలుగుతో పాటు హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ ప్రారంభంలో ఆయ‌న సీనియ‌ర్ ఎన్టీఆర్ కి డూప్ గా న‌టించారు. ఎన్టీఆర్ ద్వి పాత్రాభిన‌యం, త్రిపాత్రాభిన‌యం చేసిన చాలా సినిమాల్లో స‌త్యనారాయ‌ణ న‌టించారు. కైకాల స‌త్య‌నారాయ‌ణ న‌టుడిని గుర్తించిన ఎన్టీఆర్ అపూర్వ స‌హ‌స్ర స‌చ్ఛ‌రిత్ర సినిమాలో స‌త్య‌నారాయ‌ణ‌కు ఓ పాత్ర ఇప్పించారు. ఇక అప్ప‌టి నుంచి త‌న న‌ట‌న‌తో దూసుకెళ్లారు. విల‌న్ గా, ఫాద‌ర్ గా, అంకుల్ క్యారెక్ట‌ర్స్ తో టాలీవుడ్ లో త‌న‌కి తిరుగులేద‌నిపించుకున్నారు.

Advertisement


దాదాపు 750 కి పైగా సినిమాల్లో న‌టించిన కైకాల ప్ర‌స్తుతం ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో సినిమాల‌కు దూరంగా ఉన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని కృష్ణాజిల్లాలో జ‌న్మించారు కైకాల. ఇక ఈయ‌న‌ య‌మ‌ధ‌ర్మ‌రాజు పాత్ర‌లో ఒదిగిపోయేవారు. వాస్త‌వానికి య‌ముడంటే ఎలా ఉంటాడో తెలియ‌దు కానీ కైకాలా ద్వారా య‌ముడు ఇలా ఉంటాడ‌నిపించేది అని చాలా మంది చెబుతుంటారు. శ్రీ‌కృష్ణార్జున యుద్ధంలో క‌ర్ణుడిగా, ల‌వ‌కుశ‌లో భ‌ర‌తుడిగా, న‌ర్త‌న‌శాల‌లో దుశ్సాస‌నుడిగా, శ్రీ‌కృష్ణ పాండ‌వీయం సినిమాలో ఘ‌టోత్క‌చుడిగా, య‌మ‌లీల చిత్రంలో య‌ముడిగా విభిన్న‌మైన పౌరాణిక పాత్ర‌ల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా ద‌గ్గ‌ర‌య్యారు. ఎన్టీఆర్ తో 1977లో అడ‌వి రాముడు సినిమాలో న‌టించ‌డ‌మే కాకుండా ఆ సినిమాను నిర్మించారు. ఇక ఆ సినిమా ఆల్ టైం బ్లాక్ బ‌స్టర్ గా నిలిచింది.


యుముడి పాత్ర‌లో కైకాల య‌ముడికి మొగుడు, య‌మ‌లీల వంటి సినిమాల్లో అద్బుత‌మైన న‌ట‌న క‌న‌బ‌రిచింది. కైకాల స‌త్యానారాయ‌ణ శ్రీ‌కాంత్ హీరోగా య‌మ‌గోల మ‌ళ్లీ మొద‌లైంది. ర‌వితేజ హీరోగా వ‌చ్చిన ద‌రువు సినిమాల్లో సీనియ‌ర్ య‌ముడిగా ద‌ర్శ‌నం ఇచ్చారు. య‌మ‌గోల సినిమాలో కైకాల య‌ముండా అనే డైలాగ్ ఎంతో పాపుల‌ర్ అయింద‌నే చెప్పాలి. ఇప్ప‌టికీ ఈ డైలాగ్ అప్పుడ‌ప్పుడు ఫ‌న్నీగా వాడుతుంటారు. బాల‌కృష్ణ కోరిక మేర‌కు ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు సినిమాలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హెచ్.ఎం.రెడ్డి పాత్ర‌లో న‌టించారు. కైకాల కేజీఎఫ్ చాప్ట‌ర్ 1 సినిమాకి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన మ‌హ‌ర్షి సినిమాలో ఒక చిన్న అతిథి పాత్ర‌లో న‌టించారు కైకాల స‌త్య‌నారాయ‌ణ‌.

Also Read : 

సూపర్ స్టార్ కృష్ణకు కన్నీళ్లు పెట్టించిన రమేష్ బాబు కొడుకు జయకృష్ణ.. కారణం..!!

Visitors Are Also Reading