Home » సూపర్ స్టార్ కృష్ణకు కన్నీళ్లు పెట్టించిన రమేష్ బాబు కొడుకు జయకృష్ణ.. కారణం..!!

సూపర్ స్టార్ కృష్ణకు కన్నీళ్లు పెట్టించిన రమేష్ బాబు కొడుకు జయకృష్ణ.. కారణం..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు కూడా చాలా సినిమాల్లో హీరోగా నటించారు. ఓ వైపు నటుడిగా మరోవైపు ప్రొడ్యూసర్ గా చేసి రమేష్ బాబు చిన్నవయసులోనే మరణించి కృష్ణ గారికి తీవ్రమైన బాధను మిగిల్చారు. ఆయన మరణం సూపర్ స్టార్ కృష్ణ తో పాటుగా తెలుగు చిత్ర రంగం మొత్తాన్ని కుదిపేసిందని చెప్పవచ్చు. అయితే తన తండ్రి రమేష్ బాబు చనిపోయిన తర్వాత ఇంటికి పెద్ద కొడుకు గా జయకృష్ణ ఏం చేసాడో తెలిసి చాలా కన్నీళ్లు పెట్టుకున్నారట సూపర్ స్టార్ కృష్ణ.

Advertisement

చిన్న వయసులోనే నా మనవడికి ఇంత కష్టం వచ్చిందా అని ఆయన చాలా ఆవేదన చెందారట. మరి ఇంతకీ ఆయన చేసిన పని ఏంటయ్యా అంటే.. జయ కృష్ణకి కూడా సినిమా రంగంపై ఆసక్తి ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన అమెరికాలో ఫిలిం టెక్నాలజీలో ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో తన తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోవడం, వల్ల తన చదువును మధ్యలోనే ఆపేసి గత ఏడు నెలలుగా తన తల్లి చెల్లెను తానే చూసుకుంటున్నాడు. ఇదిలా ఉండగానే త్వరలో ఆయన అమెరికా వెళ్లి పోతున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలోనే ఇంటికి పెద్ద కొడుకుగా తన తండ్రి గారి అస్థికలను చివరిసారిగా కాశీలో కలపడానికి వెళ్లినట్లుగా తెలుస్తోంది.

Advertisement

తను కాశీలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో అభిమానులు అందరూ ఆయనకు ధైర్యం చెబుతున్నారు. మీరు వెండి తెరపై హీరోగా కనిపించాలని, మహేష్ బాబు తర్వాత అంతటి స్టార్ హీరో మీరే అవుతారని మేము నమ్ముతున్నామని అన్నారు. మీరెప్పుడు మమ్మల్ని హీరోగా అలరిస్తారని, సూపర్ స్టార్ కృష్ణ మరియు మహేష్ బాబు గారి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా తన మనవడు ఇంత చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోయి ఉండటం చూసి సూపర్ స్టార్ కృష్ణ విలపించారని తెలుస్తోంది.

also read;

 

Visitors Are Also Reading